iPhone 13 Price Cut : అమెజాన్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్..!

ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ iPhone 13 మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

iPhone 13 Price Cut : అమెజాన్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్..!

Iphone 13 Price Cut Amazon Selling Smartphone At Rs 11,000 Discount, Right Time To Buy

iPhone 13 Price Cut :  ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ iPhone 13 మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ బిగ్ డిస్కౌంట్ అందిస్తోంది. iPhone 13 మోడల్ ధర భారీ తగ్గింపు ఆఫర్ చేస్తోంది అమెజాన్.. ప్రస్తుతం iPhone 13 రిటైల్ ధర గరిష్టంగా రూ.79,900 ఉండగా.. డిస్కౌంట్‌తో రూ.74,900కే అందిస్తోంది. దాంతో వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.11,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు అనమాట.. ఒక్క డిస్కౌంట్ మాత్రమే కాదు.. ఆఫ‌ర్‌ల‌ను పొంద‌వ‌చ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో ఐఫోన్ 13ను కొనుగోలు చేస్తే.. క్యాష్‌బ్యాక్ (Cash Back) ద్వారా కొనుగోలుదారులు రూ.6000 వరకు తగ్గింపు పొందవచ్చు. బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసినవారికి ఈ ఐఫోన్ ధ‌ర రూ.68,900కే సొంతం చేసుకోవచ్చు. iPhone 13 (256GB) వేరియంట్‌ రూ.78,900 డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయొచ్చు. కొనుగోలుదారులు క్రెడిట్ కార్డ్‌ డిస్కౌంట్‌లను కూడా వినియోగించుకోవచ్చు. 512GB వేరియంట్‌ ధరను రూ.98,900 డిస్కౌంట్ ధరతో సొంతం చేసుకోవచ్చు.

Iphone 13 Price Cut Amazon Selling Smartphone At Rs 11,000 Discount, Right Time To Buy (1)

Iphone 13 Price Cut Amazon Selling Smartphone At Rs 11,000 Discount, Right Time To Buy 

అమెజాన్ ప్రకారం.. కొనుగోలుదారులు iPhone 13 కొనుగోలు చేసిన 90రోజులలోపు క్రెడిట్ కార్డ్‌ (Credit Card)లకు లేదా బ్యాంక్ అకౌంట్‌ల‌లో రూ.6వేలు క్రెడిట్ అవుతాయి. క్యాష్ బ్యాక్ క్రెడిట్ కావడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఈ iPhone 13 మోడల్ కొనుగోలుపై ఎక్ఛేంజ్ ఆఫ‌ర్‌ను కూడా పొందవచ్చు. అమెజాన్‌లో iPhone 13 ఫోన్‌పై ఎక్ఛేంజ్ ఆఫ‌ర్ 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌లతో సహా అన్ని మోడల్స్‌కు వ‌ర్తిస్తుంద‌ని అమెజాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కొనుగోలు దారులు పాత స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,350 వరకు ఎక్ఛేంజ్ ఆఫ‌ర్‌ పొందే అవకాశం ఉంది. అది కూడా మీరు వాడే స్మార్ట్‌ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. మరోవైపు.. మరో ఈకామర్స్ దిగ్గజం Flipkart కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్13పై రూ.5000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దాంతో Apple iPhone 13 మోడల్ రూ.74,900కే సొంతం చేసుకోవచ్చు. అలాగే Axis Flipkart Bank credit cards ద్వారా కొనుగోలు చేస్తే.. 5శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

Read Also : iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?.. ఇండియా ఐస్టోర్‌లో భారీ తగ్గింపు.. ధర ఎంతంటే?