iPhone 13 : గుడ్ న్యూస్.. iPhone 13 ధర తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్..!

iPhone 13 Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ గత ఏడాదిలోనే ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ చేసింది. ఆపిల్ సేల్ సందర్భంగా.. iPhone 13 రూ. 58,900 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

iPhone 13 : గుడ్ న్యూస్.. iPhone 13 ధర తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్..!

Iphone 13 Price Reduced To Rs 58,900 On Vijay Sales, But There Is A Catch

iPhone 13 Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ గత ఏడాదిలోనే ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ చేసింది. కొన్ని నెలలుగా iPhone 13 ఫోన్.. ఈ కామర్స్ దిగ్గజాలైన Amazon, Flipkart, Croma, iStore వంటి వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు iPhone 13తో సహా అనేక Apple ప్రొడక్టులు, Apple Days సేల్ సందర్భంగా విజయ్ సేల్స్‌పై భారీ డిస్కౌంటుతో ఆఫర్ చేస్తున్నాయి. కానీ, ఈ డీల్‌లు లిమిటెడ్ పీరియడ్ మాత్రమే.. ఐఫోన్ 13 తక్కువ ధరకే సొంతం చేసుకోండి.

ఆపిల్ సేల్ సందర్భంగా.. iPhone 13 రూ. 58,900 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆఫర్‌కు కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. iPhone 13 మోడల్ 128GB స్టోరేజ్ ధర రూ. 71,900కు అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే.. రూ. 5,000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అంటే.. ఐఫోన్ 13 ధర తగ్గింపు ధరతో ధర రూ.66,900కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా, విజయ్ సేల్స్ రూ. 8,000 మొత్తం ఎక్స్ఛేంజ్ విలువను అందిస్తోంది. దీని ధర మొత్తంగా రూ. 58,900కి తగ్గింది. ఐఫోన్ 13 అనేక ప్లాట్‌ఫారమ్‌లపై భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. విజయ్ సేల్స్ అందించేది చాలా బెస్ట్ ఆఫర్ అనే చెప్పాలి.

Iphone 13 Price Reduced To Rs 58,900 On Vijay Sales, But There Is A Catch (2)

Iphone 13 Price Reduced To Rs 58,900 On Vijay Sales, But There Is A Catch (2)

మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 13 సొంతం చేసుకోవాలనుకుంటే.. ఇదే సరైన సమయం.. మీ పాత ఐఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా కూడా సొంతం చేసుకోవచ్చు. అదనంగా.. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా, విజయ్ సేల్స్ ప్రతి ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో కొనుగోలుపై ఉచిత వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ను కూడా అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 11, iPhone 12, iPhone SE (2022), iPad 9 th Gen, iPad Air 5 th Gen, iPad Airతో సహా అనేక ఇతర Apple ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. 4వ జనరేషన్ iPad Pro, M1 చిప్‌తో MacBook Air, M1 చిప్‌తో MacBook Pro, M1 చిప్‌తో MacBook Pro అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 13 : ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఆపిల్ ఐఫోన్ 13 తయారీ మొదలైందోచ్.. ఇకపై లేటెస్ట్ ఐఫోన్లన్నీ చెన్నైలోనే..!