iPhone 13 Series : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ మోడల్స్.. అదే ధర.. అవే ఫీచర్లు..!

ప్రముఖ ఆపిల్ కంపెనీ నుంచి కొత్త ఐఫోన్ మోడల్స్ రానున్నాయి. 2021లో ఆపిల్ మొత్తం వార్షిక ఉత్పత్తిలో 39 శాతం కొత్త ఐఫోన్ మోడల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ ఫోర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

iPhone 13 Series : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ మోడల్స్.. అదే ధర.. అవే ఫీచర్లు..!

Iphone 13 Series Iphone 13 Pricing To Be On Par With Iphone 12 Series (1)

iPhone 13 Series : ప్రముఖ ఆపిల్ కంపెనీ నుంచి కొత్త ఐఫోన్ మోడల్స్ రానున్నాయి. ఆపిల్ ఐఫోన్ సరికొత్త వెర్షన్లు 2021 ఏడాదికి ఆపిల్ పూర్తి వార్షిక ఉత్పాదక పరిమాణంలో 39 శాతం ఉండనున్నాయి. ఈ మేరకు మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ ఫోర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐఫోన్ 13 (ఐపోన్ 12s) మాదిరిగానే అదే ధరతో వస్తోంది. ఐపోన్ 12 సిరీస్ మాదిరి ఫీచర్లతోనే మార్కెట్లోకి రానుంది. అయితే ఈ ఐఫోన్ 13 సిరీస్‌లోనూ ఐఫోన్ 12 మోడల్స్ మాదిరిగానే ఒకే స్టోరేజీ ఆప్షన్లతో రానున్నట్టు తెలుస్తోంది.

ఈ సిరీస్‌లో ఐఫోన్ 13 ప్రో మోడల్స్ LiDAR సెన్సార్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 2021లో ఐఫోన్ల మొత్తం ఉత్పత్తి 12.3 శాతంతో 223 మిలియన్ల యూనిట్లు పెరగనుంది. మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో ఐఫోన్ 13 సిరీస్ మోడల్స్ 39శాతంగా ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఆపిల్ కంపెనీ.. తమ ఐఫోన్ 13 యూనిట్లను 86మిలియన్ల వరకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇంతకీ కొత్త ఐఫోన్ 13 సిరీస్ లో ఫీచర్లు ఎలా ఉంటాయి అనేదానిపై రివీల్ చేయలేదు.

ప్రస్తుత ఐఫోన్ 12 సిరీస్ మోడల్స్ కు అప్ గ్రేడ్ వెర్షన్ మోడల్స్ గా తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ ఐఫోన్లలో A15 ప్రాసెసర్ ఆధారంగా TSMC’s 5nm+ ప్రాసెస్ అందిస్తోంది. సెన్సార్ సైజు తగ్గించి స్రింకన్ నాచ్ తో వస్తోంది. ఈ సిరీస్ లో రెండు ప్రో మోడల్స్ 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తున్నాయి.

అన్ని ఐఫోన్ మోడళ్లలో ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ (OIS) అప్ గ్రేడ్ సెన్సార్ షిప్ట్ ఉంటుంది. ప్రో మోడళ్లలో మాత్రమే LiDAR సెన్సార్లను అందిస్తోంది ఆపిల్. అలాగే అల్ట్రా వైడ్ కెమెరాలతో పాటు ఆరు రకాల లెన్స్, ఆటోఫోకస్ సపోర్టుతో రానుంది. ఐఫోన్ 13 సిరీస్ ధర కూడా ఐఫోన్ 12 మోడల్స్ లైనప్ (రూ.80వేల నుంచి) మాదిరిగానే ఉంటుందని అంచనా.