iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు, బెనిఫిట్స్.. ఇదే బెస్ట్ టైమ్.. వెంటనే కొనేసుకోండి..!

iPhone 14 Discount Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్లపై (iPhone Sale) భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రస్తుత ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) జనరేషన్ మోడల్ డిస్కౌంట్‌తో వచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు, బెనిఫిట్స్.. ఇదే బెస్ట్ టైమ్.. వెంటనే కొనేసుకోండి..!

iPhone 14 available for around Rs 50,000, but there is a catch

iPhone 14 Discount Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్లపై (iPhone Sale) భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రస్తుత ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) జనరేషన్ మోడల్ డిస్కౌంట్‌తో వచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, ఐఫోన్ 128GB స్టోరేజ్ మోడల్ రూ. 79,900 ధర నుంచి తగ్గిపోయి రూ. 77,400కి అందుబాటులో ఉంది. మీరు HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్ అయితే.. కస్టమర్‌లు రూ. 5వేల డిస్కౌంట్ పొందవచ్చు. బేస్ వేరియంట్ ధరను రూ.72,400కి తగ్గించవచ్చు.

256GB ఆప్షన్ కూడా రూ. 87,400కి అందుబాటులో ఉంది. అయితే HDFC కార్డ్ ఆఫర్ ధరను రూ. 82,400కి తగ్గించింది. ఈ ఐఫోన్ ధర మరింత తగ్గడానికి మరో మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు (Apple) ఈ-స్టోర్ కూడా ఎక్స్ఛేంజ్ లేదా ట్రేడ్-ఇన్ ఆప్షన్ అందిస్తాయి. అదనపు డిస్కౌంట్ పొందాలంటే.. మీ పాత ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ డీల్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.

iPhone 14 available for around Rs 50,000, but there is a catch

iPhone 14 available for around Rs 50,000

Read Also : iPhone 14 Satellite Feature : మంచులో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఐఫోన్ 14 శాటిలైట్ ఫీచర్.. అదేలా సాధ్యపడిందో తెలిస్తే షాకవుతారు..!

సాధారణంగా, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కన్నా ఐఫోన్‌ల రీసేల్ విలువ ఎక్కువగా ఉంటుంది. Flipkart బేస్ వేరియంట్ ధరను రూ. 51,900కి తగ్గాలంటే ఎక్స్ఛేంజ్ డీల్‌తో యూజర్లు రూ. 20,500 వరకు తగ్గింపును పొందవచ్చు. కస్టమర్‌లు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు పొందవచ్చు. ఈ విలువ స్మార్ట్‌ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. మీరు ఐఫోన్ ప్రో (iPhone Pro) వేరియంట్‌ని ట్రేడింగ్ చేసే వరకు దీని వాల్యూ రూ. 10వేల లోపు ఉంటుంది.

Apple ప్రస్తుతం ఎదుర్కొంటున్న సరఫరా గొలుసు సమస్యల కారణంగా నిర్దిష్ట పిన్ కోడ్‌లకు iPhone 14 అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రెండోది ప్రస్తుతం భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,999కి అందుబాటులో ఉంది.

ప్రస్తుత డిస్కౌంట్ ఆఫర్ ద్వారా మీరు రూ. 59,999కి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. రెండు ఫోన్‌లు అతితక్కువ తేడాలతో ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఆ రెండు ఫోన్లలో Apple A15 బయోనిక్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. వెనుక డ్యూయల్ 12-MP కెమెరాలను కలిగి ఉంది. ముందు భాగంలో 12-MP ఫ్రంట్ కెమెరా ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Pro Models : ఈ హాలీడే సీజన్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కొనుగోలు కష్టమే.. ఎందుకో తెలుసా?