iPhone 14 : ఆపిల్ నుంచి శాటిలైట్ కనెక్టవిటీతో iPhone 14 ఫోన్ వస్తోంది.. ఎప్పుడంటే?

iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ వస్తోంది. అన్ని ఐఫోన్లలా ఇది సెల్యూలర్ సిగ్నల్ ఆధారంగా పనిచేయదు.. శాటిలైట్ కనెక్టవిటీతో iPhone 14 పనిచేయనుంది.

iPhone 14 : ఆపిల్ నుంచి శాటిలైట్ కనెక్టవిటీతో iPhone 14 ఫోన్ వస్తోంది.. ఎప్పుడంటే?

Iphone 14 Series Iphone 14 Expected To Come With Satellite Connectivity

iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ వస్తోంది. అన్ని ఐఫోన్లలా ఇది సెల్యూలర్ సిగ్నల్ ఆధారంగా పనిచేయదు.. శాటిలైట్ కనెక్టవిటీతో iPhone 14 పనిచేయనుంది. శాటిలైట్ నెట్ వర్స్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ ఈ సర్వీసును వినియోగించుకోవచ్చు. ఆపిల్ నుంచి రాబోయే iPhone 14 సిరీస్ గత జనరేషన్ ఐఫోన్‌ల కన్నా మరింత సమర్థవంతమైనదిగా పనిచేయనుంది. ఐఫోన్ 14 సిరీస్ అత్యవసర పరిస్థితుల్లో యూజర్లకు ఉపయోగపడేందుకు వీలుగా శాటిలైట్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకించి సిగ్నల్ లేని ప్రాంతాల్లో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని శాటిలైట్ నెట్‌వర్క్‌లకు ఈ ఫీచర్ కనెక్ట్ అవుతుంది. ఐఫోన్ 14 సెప్టెంబర్ 2022లో ప్రపంచ మార్కెట్లోకి రానుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని శాటిలైట్ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయడానికి ఐఫోన్ 14 శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు నివేదికలో తెలిపారు. గత ఏడాదిలో ఐఫోన్ 13 సిరీస్‌ లాంచ్‌కు ముందు శాటిలైట్ నెట్ వర్క్ ఫోన్లపై ఊహాగానాలు వినిపించాయి. అయితే ఐఫోన్ 13లలో రాలేదు. కానీ, ఈసారి ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో మాత్రం శాటిలైట్ కనెక్టివిటీ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ యూజర్లు శాటిలైట్ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చునని బ్లూమ్ బర్గ్ మార్క్ గుర్మాన్ నివేదించారు. ఐఫోన్ 14 డివైజ్ నుంచి యూజర్లు తమ కాంటాక్ట్స్ ద్వారా అత్యవసర సందేశాలను పంపే ఆప్షన్ ఉండనుంది. ఈ ఫీచర్ ఆప్షన్.. సెల్యులార్ సర్వీసులు అందుబాటులో లేనప్పుడు మెసేజ్ షేర్ చేయడానికి యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఐఫోన్ 14 సిరీస్‌లో ఆపిల్ 4 మోడళ్లను రిలీజ్ చేయనుంది.

Iphone 14 Series Iphone 14 Expected To Come With Satellite Connectivity (1)

Iphone 14 Series Iphone 14 Expected To Come With Satellite Connectivity 

iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Max మోడళ్లతో పాటు మరో పేరులేని ఐఫోన్ మోడల్ కూడా లాంచ్ కానుంది. అది ఐఫోన్ 14 Mini కాకపోవచ్చునని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి Apple iPhone 14 mini వెర్షన్‌ ఉండకపోవచ్చునని అంటున్నారు. ఈ Mini వెర్షన్‌కు బదులుగా iPhone 14 Max వేరియంట్ ఉండవచ్చునని భావిస్తున్నారు. రాబోయే ఐఫోన్ 14 మోడల్‌లు వేర్వేరు ప్రాసెసర్‌లతో రానున్నట్టు అంచనా. అందులో రెండు A16 ప్రాసెసర్‌తో రానున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 13 సిరీస్‌లో వచ్చిన A15 రీబ్రాండెడ్ వెర్షన్‌గా భావిస్తున్నారు. గ్లోబల్ చిప్ కొరత కారణంగా Apple A15 నుంచి A16కి రీబ్రాండ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కుపెర్టినో-ఆధారిత టెక్ దిగ్గజం తమకు అవసరమైన అన్ని A16 M2 చిప్‌లను తయారు చేసుకునే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.

iPhone 14 మోడల్ కెమెరాలలో పెద్దగా అప్‌గ్రేడ్‌లు ఏమి ఉండకపోవచ్చునని తెలుస్తోంది. iPhone 11, iPhone 12 iPhone 13తో సహా గత వెర్షన్ iPhone మోడల్‌లలోని అదే 12-megapixel కెమెరా సెన్సార్‌లను iPhone 14 లోనూ ఉంటాయని భావిస్తున్నారు. iPhone Pro మోడల్‌లు 48-MP ప్రైమరీ సెన్సార్‌తో రావచ్చునని భావిస్తున్నారు. iPhone 14 సిరీస్ సెప్టెంబర్ 2022లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఐఫోన్ ఇప్పటికే ట్రయల్ ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని నివేదికలు చెబుతున్నాయి.

Read Also :  iPhone 13 : గుడ్ న్యూస్.. iPhone 13 ధర తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్..!