iPhone 14 : సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. 4 మోడల్స్.. ఫీచర్లు ఇవేనా?

iPhone 14 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ తీసుకొస్తోంది. ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే సెప్టెంబర్ నెలలో ఈ కొత్త ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

iPhone 14 : సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. 4 మోడల్స్.. ఫీచర్లు ఇవేనా?

Iphone 14 Launch Expected In September

iPhone 14 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ తీసుకొస్తోంది. ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే సెప్టెంబర్ నెలలో ఈ కొత్త ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేసే అవకాశం ఉంది. గత ఏడాదిలో  ఐఫోన్ 13 లాంచ్ అయింది. ఐఫోన్ 14 నెక్స్ట్ ఐఫోన్ ఐఫోన్ మోడల్ వస్తుందంటూ ఇప్పటికే లీక్‌లు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఎంతగా అంటే.. ఐఫోన్ 14 ఫీచర్లు ఏమి ఉండనున్నాయో అన్ని తెలిసిపోయినట్టే.. అందులోని డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్ గురించి వివరాలు లీకయ్యాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య చైనాలో నిరంతరం లాక్‌డౌన్ కారణంగా iPhone 14 లాంచ్ ఆలస్యం కావచ్చని గత నివేదికలు తెలిపాయి.

ఇటీవలి కొన్ని నివేదికల్లో.. ఐఫోన్ 14 లాంచ్ త్వరలో రానున్నట్టు తెలిపాయి. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్‌లు సెప్టెంబర్ రెండవ వారంలో అధికారికంగా రిలీజ్ కానున్నాయి. అయితే ఐఫోన్ 14 రిలీజ్ డేట్ ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఏడాది కూడా ఐఫోన్ 14 సిరీస్‌లో ఆపిల్ 4 కొత్త ఐఫోన్‌లను రిలీజ్ చేయనుంది. ఈ మోడల్‌లలో iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Max ఉన్నాయి. ఫోన్ 14, ఐఫోన్ 13 మాదిరిగానే.. 6.1-అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. మొదటిసారిగా AMOLED ప్యానెల్‌తో రానుంది. ఈ ఏడాదిలో ‘మినీ’ మోడల్ లేదా ఐఫోన్ 14 మినీ ఉండే అవకాశం లేదు.

Iphone 14 Launch Expected In September (1)

Iphone 14 Launch Expected In September 

ఐఫోన్ మినీ మోడల్‌ను నిలిపివేయడానికి సంబంధించిన వివరాలను Apple వెల్లడించలేదు. ఐఫోన్ SE మోడల్స్‌పై సేల్ ప్రభావం పడింది. మినీ మోడల్‌ను నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోందని కంపెనీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఐఫోన్ 14 మినీ, ఐఫోన్ 14 మ్యాక్స్‌తో రానుంది. ఆపిల్ ఐఫోన్ ప్రో మోడల్స్ నుంచి కొన్ని ఫీచర్లను ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే సరసమైన ధరకే రానుందని అంచనా. ఐఫోన్ 14 విషయానికొస్తే.. ఐఫోన్ 13 అప్‌గ్రేడ్‌తో రానుందని భావిస్తున్నారు. ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌ను గత ఏడాది ఈవెంట్‌లో కంపెనీ ఆవిష్కరించింది.

అందులో ప్రధాన అప్‌డేట్స్‌లో ఒకటి కెమెరా సెక్షన్.. ఐఫోన్ 14 డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానుందని అంచనా. అయితే సెన్సార్లు ఐఫోన్ 13 కంటే పెద్దవిగా ఉండనున్నాయి. కొన్ని ఏళ్లుగా iPhone యూజర్లు బ్యాటరీ పనితీరుపై ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయితే కంపెనీ iPhone 13తో సమస్యను కొంతవరకు పరిష్కరించింది. రాబోయే iPhone 14తో Cupertino-ఆధారిత టెక్ దిగ్గజం బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపరచాలని యోచిస్తోంది. iPhone 14, iPhone 13 కన్నా కొంచెం పవర్‌ఫుల్‌‌గా ఉంటుందని భావిస్తున్నారు.

రాబోయే iPhone 14 ఇప్పటికే A15 బయోనిక్ చిప్‌ని ఉపయోగిస్తుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇతర రిపోర్టులు A16 బయోనిక్ చిప్‌సెట్ రాబోతున్నట్లు సూచిస్తున్నాయి. డిజైన్ పెద్ద సెన్సార్‌లతో పాటు ఐఫోన్ 13 మాదిరిగానే ఉండనున్నాయి. iPhone 14, iPhone 14 Max యాంగిల్-నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. ఆపిల్ ఐఫోన్ ప్రో మోడల్‌లు డిజైన్‌ను అందిస్తాయి. ధర పరంగా iPhone 14 దాదాపు iPhone 13 ధరతో సమానంగా ఉంటాయి. iPhone 14, iPhone మాదిరిగా 799 డాలర్ల ప్రారంభ ధర వద్ద లాంచ్ కానుంది. భారత మార్కెట్లో ఐఫోన్ 13 రూ. 79,990 ధరతో లాంచ్ కానుంది. ఐఫోన్ 14కి కూడా అలానే ఉండే అవకాశం ఉంది.

Read Also : iPhone 14 : ఐఫోన్ 13 ప్రాసెస‌ర్‌తో ఐఫోన్ 14 వస్తోంది.. ఎప్పుడో తెలుసా?