iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

iPhone 14 : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ 14 సిరీస్ వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే ఇప్పటివరకూ Apple iPhone 14 సిరీస్ వివరాలపై ఆపిల్ ఇంకా ఏం వెల్లడించలేదు.

iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Iphone 14 Launch Expected In September, Here’s How Much It Could Cost (1)

iPhone 14 : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ 14 సిరీస్ వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే ఇప్పటివరకూ Apple iPhone 14 సిరీస్ వివరాలపై ఆపిల్ ఇంకా ఏం వెల్లడించలేదు. ఆన్‌లైన్‌లో iPhone 14 ధర ఎంత ఉంటుంది? అనేది వివరాలు లీక్ అయ్యాయి. సెప్టెంబర్ లో ఏ తేదీన ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అవుతుంది అనేది తెలియదు. కానీ, సెప్టెంబర్ రెండవ వారంలో iPhone 14 మోడల్స్ అధికారికంగా అందుబాటులోకి వస్తాయని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ ఏడాదిలో ఆపిల్ iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Max Pro సహా 4 కొత్త ఐఫోన్ మోడళ్లను ఆవిష్కరించాలని భావిస్తున్నారు. iPhone SE సిరీస్ అమ్మకాలపై ప్రభావం పడటంతో ఈ ఏడాదిలో ఐఫోన్ మినీ ఫోన్ ప్రవేశపెట్టే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు. నివేదికల విషయానికొస్తే.. iPhone 13 సిరీస్‌తో పోలిస్తే.. iPhone 14 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు అద్భుతంగా ఉండనున్నాయి.

Iphone 14 Launch Expected In September, Here’s How Much It Could Cost

Iphone 14 Launch Expected In September, Here’s How Much It Could Cost

అధికారిక లాంచ్‌కు ముందు.. iPhone 14 ధరపై అనేక అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ 14 ధర ఐఫోన్ 13 మాదిరిగానే ఉంటుందని ఇంటర్నెట్‌లో చాలా నివేదికలు సూచిస్తున్నాయి. రాబోయే ఐఫోన్ మోడల్ ఐఫోన్ 13 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. iPhone 13 గత ఏడాదిలో రూ. 79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. iPhone 13 ఫోన్ 128GB స్టోరేజ్, 256GB స్టోరేజ్, 512GB స్టోరేజ్ అనే 3 వేరియంట్‌లలో వస్తుంది. ధర పరంగా చూస్తే.. iPhone 13 128GB, రూ. 79,900, 256GB, 512GB స్టోరేజ్ మోడల్‌లు వరుసగా రూ. 89,900 రూ. 1,09,900 ఉండనున్నాయి. అమెరికాలోనూ iPhone 14 (iPhone 13 మాదిరిగానే) $799తో ప్రారంభమవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

iPhone 14 Max, iPhone 14 Pro iPhoneతో సహా ఇతర iPhone 14 మోడళ్ల విషయంలో iPhone 14 Pro Max ధర మరోలా ఉండొచ్చు. iPhone 13 మాదిరిగానే.. iPhone 14 కనీసం 128GB స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. హైఎండ్ స్టోరేజీ 1TB వరకు ఉండే అవకాశం ఉంది. అదే నిజమైతే.. iPhone 1TB స్టోరేజీతో రావడం ఇదే మొదటిసారి కానుంది. డిజైన్ పరంగా.. ఐఫోన్ 14 స్పెసిఫికేషన్ల పరంగా కొంచెం అప్‌గ్రేడ్‌లతో రానుంది. రాబోయే iPhone 14 చూసేందుకు డిజైన్.. లుక్ మొత్తం ఐఫోన్ 13 లాగానే కనిపిస్తుంది. AMOLED డిస్‌ప్లే, A16 బయోనిక్ చిప్‌సెట్, iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ కెమెరాలు, పెద్ద సెన్సార్‌లు, iPhone 13 కన్నా పెద్ద బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.

Read Also : iPhone 14 : సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. 4 మోడల్స్.. ఫీచర్లు ఇవేనా?