iPhone 14 Series : భారత్‌లో ఐఫోన్ 13 ధరతో పోలిస్తే.. ఐఫోన్ 14 ధర రూ.10వేలపైనే ఉండొచ్చు..!

ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 13 సిరీస్ మాదిరిగా ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కానుంది.

iPhone 14 Series : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 13 సిరీస్ మాదిరిగా ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కానుంది. అయితే ఈ ఐఫోన్ 14 మోడల్ ఐఫోన్ 13 ధర కంటే పదింతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2022 మోడళ్లను కొనుగోలు చేయాలంటే ఐఫోన్ 14 మోడల్ ధరపై ఎక్కువ ఉండొచ్చు. ఐఫోన్ 14 సిరీస్ ఐఫోన్ 13 సిరీస్ కన్నా $100 ఎక్కువ ఖర్చవుతుందని మార్కెట్ విశ్లేషకుడు ఒకరు సూచించారు. భారత మార్కెట్లో ఐఫోన్ 14 సిరీస్ ధర ఒక్కసారిగా భారీగా పెరగడానికి అధిక దిగుమతి సుంకం, GST ఛార్జీలు ఇతర విషయాలే కారణంగా చెప్పవచ్చ. US మార్కెట్‌తో పోలిస్తే.. iPhone ధరలు భారత్‌లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఐఫోన్ 14 మోడల్ ద్వారా యూజర్లకు అదనపు భారాన్ని ఆపిల్ పెంచనుంది.

Iphone 14 Price In India Could Be Around Rs 10,000 Higher Compared To Iphone 13

iPhone 14 కోసం $100 ధర పెరుగుతుందని భావిస్తున్నామని Wedbush సెక్యూరిటీస్ అన్నారు. ఈ ఏడాదిలో విడుదలయ్యే ఐఫోన్ అన్ని మోడళ్లపై ధరల పెరుగుదల కనిపించే అవకాశం ఉందనని కుపెర్టినో ఈ భారాన్ని యూజర్లపై మోపనుందని ఆయన చెప్పారు. ఇదే జరిగితే.. గతేడాది ఫోన్‌లతో పోలిస్తే.. iPhone 14 ధర దాదాపు రూ.10,000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో $100 అంటే.. దాదాపు రూ. 8,000 వరకు ఉంటుంది. కానీ Apple సాధారణంగా $1ని రూ. 100గా పెంచుతుంది. ధరల పెంపు దాదాపు రూ. 10,000కి చేరుకుంటుందని అంచనా.

ఐఫోన్ 13 ధర ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.79,990 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఐఫోన్ 14 ధర రూ.90,000కి దగ్గరగా ఉండవచ్చు. చాలా మంది భారతీయులకు ఐఫోన్ల ధరలు ఎక్కువగా ఉన్నందున ఐఫోన్ 14 సిరీస్‌ను కొనుగోలు చేయలేరని అంటున్నారు. ఐఫోన్ 14 ప్రో మోడళ్ల ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. డిజైన్, కెమెరా పరంగా భారీ మార్పులు చేస్తోంది ఆపిల్. ప్రో వేరియంట్‌లు కూడా కొత్త చిప్‌సెట్‌తో రానున్నాయి. ఐఫోన్ 14 సిరీస్ ప్రైమరీ మోడల్ అప్‌గ్రేడ్‌లతో రానుందని భావిస్తున్నారు. ఆపిల్ iPhone 14 ఈవెంట్‌ను సెప్టెంబర్ 13న లాంచ్ చేసే అవకాశం ఉంది.

Read Also : iPhone 14 Pro : ఈ ఏడాదిలో ఐఫోన్ 14ప్రో మోడళ్ల అమ్మకాలపైనే ఆపిల్ ఫోకస్.. ఎందుకంటే?

ట్రెండింగ్ వార్తలు