Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

2022 ఏడాదిలో సగం పూర్తి అయింది. రాబోయే నెలల్లో అనేక స్మార్ట్ ఫోన్ల బ్రాండ్ల నుంచి సరికొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు రానున్నాయి.

Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Iphone 14 Pro, Oneplus 10t, Xiaomi 12s And Other Flagship Smartphones Launching In 2022

Flagship Smartphones : 2022 ఏడాదిలో సగం పూర్తి అయింది. రాబోయే నెలల్లో అనేక స్మార్ట్ ఫోన్ల బ్రాండ్ల నుంచి సరికొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. ఇప్పటికే Samsung, Xiaomi, OnePlus, Realme, Vivo, iQOO బ్రాండ్ల నుంచి మల్టీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను అనేక ధరల విభాగంలో రిలీజ్ చేశారు. అయితే కొత్త Qualcomm MediaTek ఫ్లాగ్‌షిప్ SoCలతో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ ఏడాది చివర్లో మరిన్ని ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారు. కొత్త A16 బయోనిక్ చిప్‌సెట్‌తో iPhone 14 సిరీస్‌ను Apple లాంచ్ చేయబోతోంది. 2022 ద్వితీయార్థంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది చివర్లో లాంచ్ కానున్న ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన జాబితా మీకోసం అందిస్తున్నాం అందులో మీకు నచ్చిన బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

Xiaomi 12S సిరీస్ :
Xiaomi 12S ఫోన్ లాంచ్ ఈవెంట్ జూలై 4న జరుగనుంది. కంపెనీ మూడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. Xiaomi 12S, 12S Pro, 12S అల్ట్రా ఉండనున్నాయి. Xiaomi 12S సిరీస్‌లో లైకా-ట్యూన్డ్ కెమెరా సెన్సార్‌లు ఉంటాయి. Xiaomi 12S అల్ట్రా కూడా 1-అంగుళాల Sony IMX989 ప్రధాన కెమెరాతో రానుంది. మూడు Xiaomi స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉండనున్నాయి. Xiaomi 12S ప్రో కూడా MediaTek డైమెన్సిటీ 9000+ SoCతో లాంచ్ కానుంది ఈ మూడు ఫోన్‌లు 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఐఫోన్ 14 సిరీస్ :
ఆపిల్ ఈ ఏడాది 4 కొత్త ఐఫోన్ 14 మోడళ్లను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 14తో పాటు పెద్ద ఐఫోన్ 14Max కూడా ఉంటుంది. నాన్-ప్రో iPhone 14 మోడల్‌లు రెండూ iPhone 13 డిజైన్‌ను కలిగి ఉంటాయి A15 బయోనిక్ చిప్‌ని కలిగి ఉంటాయి. వెనుకవైపు కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఐఫోన్ 14ప్రో, ఐఫోన్ 14ప్రోమాక్స్ పెద్ద అప్‌గ్రేడ్‌లను పొందడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆపిల్ హోల్ పంచ్, ఫ్రంట్ కెమెరా, ఫేస్ ID సెన్సార్ల కోసం పిల్-ఆకారపు కటౌట్‌తో వైడ్ నాచ్‌తో వస్తుంది. ఇక ప్రో మోడల్‌లు కొత్త 48MP ట్రిపుల్-కెమెరా సెటప్, కొత్త A16 బయోనిక్ చిప్‌ను కూడా కలిగి ఉంటాయి. ఈ ఏడాదిలో ఐఫోన్ 14 మినీ లాంచ్ చేయడం కుదరదు. ఆపిల్ ఈవెంట్లో భాగంగా సెప్టెంబర్ 13న ఐఫోన్ 14 లాంచ్ కానున్నట్టు ఓ నివేదిక తెలిపింది.

OnePlus 10T 5G :
OnePlus 10T 5G కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అవుతుంది. ఈ డివైజ్ OnePlus 10R, OnePlus 10 Pro మధ్య ఉండనుంది. లీకైన ఫీచర్ల ప్రకారం.. 10T 5G 6.7-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC, 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. OnePlus 10T 5Gలో Hasselblad బ్రాండింగ్ లేదా ఐకానిక్ OnePlus అలర్ట్ స్లైడర్ ఉండదు. ఈ డివైజ్ డిజైన్ OnePlus 10 Pro 5G మైనస్ కర్వ్డ్ డిస్‌ప్లేను పోలి ఉంటుంది. 4800 mAh బ్యాటరీతో వచ్చింది. 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. OnePlus 10T 5G భారత మార్కెట్లో ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుంది. కంపెనీ OnePlus 10T 5G లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.

మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా :
ఫ్రాంటియర్ అనే కోడ్‌నేమ్, ఎడ్జ్30 అల్ట్రా వెనుక 200MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కొత్త స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC, 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ, 6.8-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, 60MP ఫ్రంట్ కెమెరాతో రానుంది. ఎడ్జ్ 30 అల్ట్రా జూలై 2022లో చైనాలో లాంచ్ కానుంది.

iQOO 9T :
iQOO 9T, iQOO 9 సిరీస్‌లో మిడ్-సైకిల్ డివైజ్ iQOO 9, iQOO9 pro మధ్య ఉండనుంది. iQOO9 ఫోన్ కొన్ని కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లీకైన iQOO 9T స్పెసిఫికేషన్‌ల ప్రకారం.. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+Gen 1 SoC, 6.78-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానుంది. iQOO 9T ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ తేదీ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. జూలైలో ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Read Also : Best Smartphones : రూ. 30వేల లోపు బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..