iPhone 15: ఐఫోన్ చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లు.. టైప్-సి పోర్ట్‌తో రానున్న ఐఫోన్ 15, ఎయిర్ పాడ్స్‌

ఐఫోన్లు వాడేవాళ్లకు ఛార్జింగ్ కేబుల్ దొరకడం ఒక సమస్య. ఎప్పుడైనా ఫోన్లో బ్యాటరీ డౌన్ అయ్యి, ఛార్జింగ్ చేసుకుందామంటే యాపిల్ ఫోన్లకు పనికొచ్చే కేబుల్ దొరకదు. దీనికి ప్రత్యేక కేబుల్ ఒకటి అదనంగా ఎప్పుడూ వెంట ఉంచుకోవాల్సిందే. అయితే, వచ్చే ఏడాది నుంచి ఈ కేబుల్ కష్టాలకు చెక్ పడబోతుంది.

iPhone 15: ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్ వంటి యాపిల్ గాడ్జెట్స్ వాడే వాళ్లకు శుభవార్త. వచ్చే ఏడాది నుంచి రాబోయే ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్ వంటి అన్ని యాపిల్ ఉత్పత్తులు ఇకపై యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్ పోర్ట్‌తోనే విడుదలవుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే యాపిల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Parathas: పరాటాలపై 18 శాతం జీఎస్టీ.. బ్రిటీష్ వాళ్లు కూడా పన్ను వేయలేదన్న కేజ్రీవాల్

ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్‌కు ప్రత్యేక లైట్నింగ్ చార్జర్ ఉంటుందనే సంగతి తెలిసిందే. వీటికి వేరే ఛార్జింగ్ కేబుళ్లు పనిచేయవు. దీంతో ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్ వాడే వాళ్లు ప్రత్యేకంగా ఛార్జింగ్ కేబుళ్లు కొనుక్కోవాల్సిందే. అది కూడా ఒకటి అదనంగా కొనుక్కుంటేనే అత్యవసర స్థితిలో ఉపయోగపడుతుంది. అయితే, భవిష్యత్తులో రాబోయే గాడ్జెట్లతో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి రాబోయే అన్ని యాపిల్ ఉత్పత్తులు యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్ కేబుల్‌తోనే వస్తాయి. నిజానికి మార్కెట్లో యాపిల్ ఆడిందే ఆటగా ఉంది. ఎంత ఖరీదు పెట్టి ఫోన్ కొన్నా.. ఛార్జింగ్ కేబుల్ రాదు. దీన్ని బయటి నుంచే కొనుక్కోవాలి.

Munugodu: ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం.. 100కు పైగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్లే

పైగా ప్రత్యేక లైట్నింగ్ కేబుల్ మాత్రమే పనిచేస్తుంది. దీనివల్ల వినియోగదారులకు అదనంగా ఖర్చవుతోంది. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా యాపిల్ సంస్థ పట్టించుకోలేదు. కానీ, ఇటీవల ఈ అంశంలో అనేక దేశాలు యాపిల్‌కు షాక్ ఇచ్చాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎయిర్ పాడ్స్, ల్యాప్‌టాప్స్, ఇయర్ బడ్స్, కెమెరాలు వంటి చిన్న గాడ్జెట్లు అన్నింటికీ ఒకే ఛార్జింగ్ కేబుల్ ఉండేలా చట్టం చేశాయి. దీని ప్రకారం ఏ కంపెనీ అయినా యూనివర్సల్ ఛార్జర్ పనికొచ్చేలా డివైజెస్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కేబుళ్లు మాత్రమే వాడేలా గ్యాడ్జెట్లు తయారు చేస్తే వాటిని అనుమతించరు. పైగా జరిమానా కూడా విధిస్తారు. దీన్ని వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా అమలు చేస్తామని యూరోపియన్ యూనియన్ తెలిపింది.

Gurmeet Ram Rahim Singh: డేరా బాబాకు బెయిల్.. 40 రోజుల పెరోల్‌పై విడుదల కానున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

దీంతో యాపిల్ సంస్థ ఐఫోన్లు, ఎయిర్ పాడ్లు అమ్మాలంటే యూనివర్సల్ ఛార్జర్‌గా పిలిచే యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్ కేబుల్ మాత్రమే వాడాలి. లేకపోతే తమ ఉత్పత్తులు విక్రయించడం కుదరదు. ఇండియా కూడా ఈ దిశగా చట్టం చేయాలని ఆలోచిస్తుంది. ఇదే గనుక అమల్లోకి వస్తే ఏ డివైజ్‌కైనా ఒకే కేబుల్ వాడుకోవచ్చు. ఒక కేబుల్ పాడైతో మరో కేబుల్ వాడుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు