iPhone 15 Series : అద్భుతమైన కలర్ ఆప్షన్లలో ఐఫోన్ 15 సిరీస్ వస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

iPhone 15 Series Launch : ప్రపంచ కుపెర్టినో దిగ్గజం ఆపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ వస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో ఈ ఏడాదిలో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

iPhone 15 Series : అద్భుతమైన కలర్ ఆప్షన్లలో ఐఫోన్ 15 సిరీస్ వస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

iPhone 15 Pro Could Launch in Dark Red Colour Option; iPhone 15 May Arrive in Pink, Light Blue Colours

iPhone 15 Series : ప్రపంచ కుపెర్టినో దిగ్గజం ఆపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ వస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో ఈ ఏడాదిలో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఐఫోన్14 సిరీస్ గత ఏడాది సెప్టెంబర్‌లో లేటెస్ట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లుగా లాంచ్ అయింది. 2023లో కాలిఫోర్నియా-ఆధారిత టెక్ దిగ్గజం iPhone 14 లైనప్‌ను కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రాబోయే ఆపిల్ iPhone 15 మోడళ్లను సెప్టెంబరులో లాంచ్ చేసే అవకాశం ఉంది. చేస్తారు. ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మోడల్‌ల కోసం కలర్ ఆప్షన్లలో కన్నా కొన్ని నెలల ముందే సూచించింది. ఐఫోన్ లైనప్‌లో కొత్త కలర్ ఆప్షన్లు రానున్నాయి. ఇందులో ప్రస్తుతం వనిల్లా, ప్లస్ మోడల్‌లు, ప్రో వేరియంట్, ప్రో మాక్స్ వేరియంట్ ఉన్నాయి.

Read Also : iPhone 14 Plus Discount : ఆపిల్ ఐఫోన్ 14ప్లస్‌పై రూ. 10వేలు డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్ అసలే మిస్ చేసుకోవద్దు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

9to5Mac నివేదిక ప్రకారం.. ఆపిల్ వనిల్లా వేరియంట్ ఐఫోన్‌ను ప్రకాశవంతమైన కలర్ ఆప్షన్లలో iPhone 15 సిరీస్‌తో అందించే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. వనిల్లా ఐఫోన్ 15 డార్క్ పింక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. కొత్త పింక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వనిల్లా ఐఫోన్ 15 రెండర్ ఫొటోలను కూడా షేర్ చేసింది. iPhone 15 రెండు కొత్త కలర్ ఆప్షన్లలో బ్లాక్, వైట్, రెడ్ వంటి మూడు ప్రామాణిక కలర్ ఆప్షన్లలో అదనంగా ఉంటాయని నివేదిక తెలిపింది.

iPhone 15 Pro Could Launch in Dark Red Colour Option; iPhone 15 May Arrive in Pink, Light Blue Colours

iPhone 15 Series : iPhone 15 Pro Could Launch in Dark Red Colour Option

అయితే, iPhone 15 సిరీస్ కోసం కొత్త కలర్ ఆప్షన్లలో అందించే ప్లాన్లపై Apple నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నివేదిక ప్రకారం.. ఆపిల్ ప్రో మోడల్ ఐఫోన్‌లో ఈ ఏడాదిలో ప్రత్యేక కలర్ ఎడిషన్‌లను కూడా లాంచ్ చేస్తుంది. iPhone 15 Pro, iPhone 15 Pro Max/Ultra మోడల్‌లు సరికొత్త డార్క్ రెడ్ కలర్ ఆప్షన్‌లో రావచ్చని నివేదిక పేర్కొంది. ఈ కలర్‌వే టైటానియం ఎండ్‌తో వస్తుందని భావిస్తున్నారు.

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ డిస్‌ప్లేల చుట్టూ కర్వడ్ ఎడ్జెస్, సన్నగా ఉండే బెజెల్‌లను కలిగి ఉండనున్నాయి. వివిధ iPhone 15 సిరీస్ మోడల్‌లలోని స్క్రీన్ సైజులు iPhone 14 సిరీస్ సంబంధిత మోడళ్లతో రానున్నాయని గత నివేదికలు తెలిపాయి. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లకు ఆపిల్ వాచ్ లాంటి డిజైన్‌ను ఇస్తాయని భావిస్తున్నారు. Apple రాబోయే iPhone సిరీస్ డిజైన్ సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇందులో iPhone 15, iPhone 15 Pro హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి.

Read Also : Apple iPhone 15 : సరికొత్త నాచ్ డిజైన్‌తో ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేస్తోంది.. డైనమిక్ ఐలాండ్ నాచ్ అదుర్స్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!