iPhone 15 Ultra : 2023లో అత్యంత ఖరీదైన ధరకు రానున్న ఐఫోన్ 15 అల్ట్రా.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iPhone 15 Ultra : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఈ ఏడాదిలో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో మొత్తం నాలుగు ఐఫోన్ మోడల్‌లు iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max లాంచ్ అయ్యాయి.

iPhone 15 Ultra : 2023లో అత్యంత ఖరీదైన ధరకు రానున్న ఐఫోన్ 15 అల్ట్రా.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iPhone 15 Ultra : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఈ ఏడాదిలో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో మొత్తం నాలుగు ఐఫోన్ మోడల్‌లు iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max లాంచ్ అయ్యాయి. ఆపిల్ ఈ ఏడాదిలో ‘Mini’ మోడల్‌ స్థానంలో ‘Plus’ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది కూడా కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఇదే లైనప్‌ను కొంచెం రిఫ్రెష్ చేస్తుందని భావిస్తున్నారు.

వచ్చే ఏడాది ఆపిల్ ‘Pro Max’కు బదులుగా ‘Ultra’ మోడల్‌ను లాంచ్ చేస్తుందని వ్యాపించాయి. మరో మాటలో చెప్పాలంటే.. 2023లో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ (iPhone 1 Pro Max)కు బదులుగా ఐఫోన్ 15 Ultraను చూడవచ్చు. Apple iPhone 15 Ultra గురించి ఇంకా ఏమీ వెల్లడించలేదు. 2023 అత్యంత ఖరీదైన iPhone మోడల్‌కు సంబంధించిన అనేక ఫీచర్లు లీకయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం..

iPhone 15 Ultra ఫీచర్లు (అంచనా) :
* ఇటీవల లీక్ అయిన రెండర్‌లు, 3 ఏళ్ల తర్వాత, ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ డిజైన్ లాంగ్వేజ్‌ని మార్చాలని ఆలోచిస్తున్నట్లు సూచిస్తున్నాయి. ఫ్లాట్ నుంచి కర్వడ్ డిజైన్‌కి మరోసారి మారనుంది. Apple Insider లేటెస్ట్ నివేదిక ప్రకారం.. iPhone 15 Ultra కర్వడ్ ఎడ్జ్ రానుంది. ఐఫోన్ 15 అల్ట్రా రెండర్లు లీక్ కావడం ఇదే మొదటిసారి. కర్వ్డ్ డిజైన్ అంటే.. టాప్-ఎండ్ ఐఫోన్ మోడల్ ప్రస్తుత ఐఫోన్ మోడల్‌లతో పోల్చినప్పుడు లుక్స్ పరంగా చాలా భిన్నంగా ఉంటుంది. ఐఫోన్ 14 సిరీస్, ఒక ఏడాది పాత ఐఫోన్ 13 సిరీస్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డిజైన్ ఐఫోన్ 12తో లాంచ్ అయింది.

iPhone 15 Ultra could be the most expensive iPhone of 2023 _ 5 things we know

iPhone 15 Ultra could be the most expensive iPhone of 2023

Read Also : Fake iPhone 13 Models : మార్కెట్లో నకిలీ ఐఫోన్ 13 మోడల్స్ సేల్.. ఐఫోన్ కొనే ముందు జాగ్రత్త.. మీ ఫోన్ ఒరిజినల్ అవునో కాదో ఇలా చెక్ చేసుకోండి..!

* లీకైన రెండర్‌లు ఐఫోన్ 15 అల్ట్రా డ్యూయల్ సెల్ఫీ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుందని వెల్లడించింది. ఏదైనా ఐఫోన్ మోడల్‌కు ఇదే మొదటిసారి. ‘Pro’, ‘Ultra’ మోడల్‌లు రెండూ డ్యూయల్ సెల్ఫీ కెమెరా సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. అయితే బేస్ మోడల్‌లు ఒకే ఫ్రంట్ కెమెరాకు అతుక్కుపోతాయి.
* అదే నివేదిక ఐఫోన్ 15 అల్ట్రా, లేదా 2023లో అత్యంత ప్రీమియం ఐఫోన్, టైటానియం గ్లాస్ బాడీని కలిగి ఉంటుందని వెల్లడించింది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌కు అవసరమని చెప్పవచ్చు.
* కొన్ని గత నివేదికలు సోనీ గ్రూప్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ మోడల్‌లకు లేటెస్ట్ ఇమేజ్ సెన్సార్‌తో ఆపిల్‌కు సరఫరా చేస్తుందని సూచించింది. సోనీ సెన్సార్, ఓవర్ ఎక్స్‌పోజర్ లేదా అండర్ ఎక్స్‌పోజర్‌ను తగ్గించవచ్చని తెలిపింది.
* ఐఫోన్ 15 సిరీస్ క్లిక్ చేసే వాల్యూమ్, పవర్ బటన్‌లతో రాదని, సాలిడ్-స్టేట్ బటన్‌లు ఉంటాయని మింగ్-చి కువో నుంచి వచ్చిన మరో గత నివేదిక వెల్లడించింది.

ఇప్పుడు, హార్డ్‌వేర్ పరంగా.. మొత్తం iPhone 15 లైనప్ A17 బయోనిక్ చిప్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో ఆపిల్ వ్యూహాన్ని మార్చుకుంది. ఐఫోన్ 14, 14 ప్లస్‌లను ఏడాదిలో A15 బయోనిక్ చిప్‌సెట్‌తో ప్రారంభించింది. ఇక ఐఫోన్ ప్రో మోడల్‌లు iPhone 14 Pro, Pro Max – A16 బయోనిక్ చిప్‌తో వచ్చింది.

వేగవంతమైన పనితీరును మాత్రమే కాకుండా మెరుగైన బ్యాటరీ లైఫ్, కెమెరాలను కూడా అందిస్తుంది. లీక్‌లు, రూమర్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. ఆపిల్ డిజైన్, స్పెసిఫికేషన్‌ల పరంగా పెద్ద మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. 2023లో కంపెనీ మరిన్ని వివరాలను వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే..

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!