iPhone SE 4 Launch : అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ SE 4 మోడల్ ఇదిగో.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

iPhone SE 4 Launch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ సిరీస్‌ నుంచి ఐఫోన్ 15 సిరీస్‌ (iPhone 15 Series) మాత్రమే కాకుండా సరసమైన ఫోన్‌లో కూడా పని చేస్తోంది.

iPhone SE 4 Launch : అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ SE 4 మోడల్ ఇదిగో.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

iPhone SE 4 Launch _ Apple Working on a Cheaper iPhone for 2024, likely to be called iPhone SE 4

iPhone SE 4 Launch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ సిరీస్‌ నుంచి ఐఫోన్ 15 సిరీస్‌ (iPhone 15 Series) మాత్రమే కాకుండా సరసమైన ఫోన్‌లో కూడా పని చేస్తోంది. నివేదికల ప్రకారం.. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం కొత్త iPhone SE మోడల్‌పై పని చేస్తోంది. నివేదికలను పరిశీలిస్తే.. iPhone SE 4 అధికారికంగా 2024లో అందుబాటులోకి వస్తుంది. దీనిపై కచ్చితమైన లాంచ్ టైమ్‌లైన్ తెలియదు. కానీ, గత రికార్డును పరిశీలిస్తే.. రాబోయే iPhone SE మోడల్ 2024 మొదటి అర్ధ భాగంలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. iPhone SE 4 అధికారికంగా లాంచ్‌కు కొంత సమయం ఉన్నప్పటికీ.. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి అనేక లీక్‌లు కొంతకాలంగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

కొత్త నివేదిక ప్రకారం.. iPhone SE 4 మోడల్ BOE ద్వారా OLED ప్యానెల్‌తో వస్తుంది. అంటే.. రాబోయే iPhone 15 సిరీస్‌తో పోలిస్తే.. కంపెనీ తక్కువ ధరకే OLED ప్యానెల్‌ను అందించనుంది. తద్వారా కొంత ఖర్చును తగ్గించుకోనుంది. (The Elec) నుంచి రాబోయే iPhone SE 4 ఫోన్ 6.1-అంగుళాల OLED ప్యానెల్‌తో నిండి ఉంటుంది. ఆపిల్ నెక్స్ట్ ఐఫోన్ SEలో డిజైన్ పరంగా పెద్ద మార్పును తీసుకురానుంది. ఐఫోన్ SE 4 మోడల్ ఐఫోన్ 14 లాంటి డిజైన్‌ను కలిగి ఉండనుంది. నాచ్, స్లిమ్ బెజెల్‌లు కలిగి ఉండే అవకాశం ఉంది.

iPhone SE 4 Launch _ Apple Working on a Cheaper iPhone for 2024, likely to be called iPhone SE 4

iPhone SE 4 Launch _ Apple Working on a Cheaper iPhone for 2024

Read Also : International Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023.. ఆపిల్ నుంచి గార్మిన్ వరకు 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లివే..!

ఇప్పుడు, ఐఫోన్ SE 4 మోడల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానుంది. కెమెరా ముందు భాగంలో SE సిరీస్‌కు అతిపెద్ద అప్‌గ్రేడ్‌ను అందిస్తుంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. రాబోయే iPhone SE 4 మోడల్ iPhone 14ని పోలి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. రాబోయే iPhone SE 6.1-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. iPhone 13 కెమెరాల మాదిరిగా ఆపిల్ iPhone SE 4కి పెద్ద అప్‌గ్రేడ్‌ని కూడా తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు, ఆపిల్ iPhone SE కోసం ముందు, వెనుక రెండింటికీ ఒకే కెమెరా సెటప్‌ని ఎంచుకుంది.

కానీ, రాబోయే iPhone SE 4లో అనేక మార్పులు చేయొచ్చు. వెనుక ప్యానెల్‌లో రెండు సెన్సార్లను పొందవచ్చు. పర్పార్మెన్స్ పరంగా iPhone 14 మాదిరిగా ఉండకపోచ్చు. రెండు iPhone మోడల్‌ల మధ్య ధరలో కూడా చాలా తేడా ఉండనుంది. ధర విషయానికి వస్తే.. iPhone SE 4 కచ్చితంగా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం iPhone SE మోడల్ భారత మార్కెట్లో అధికారికంగా రూ. 49,990 ధరతో రానుంది. ఆపిల్ ధరల వ్యూహంలో ఏమైనా మార్పులు చేస్తుందా? రాబోయే SE 4 మోడల్‌కు కూడా ఇదే ధర ఉంటుందా? అనేది చూడాలి.

Read Also : Vijay Sales Women’s Day Sale : విజయ్ సేల్స్ మహిళా దినోత్సవం సేల్స్.. ఐఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లపై అదిరే డిస్కౌంట్లు.. తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా!