iPhone SE 4 : ఐఫోన్ XR డిజైన్‌తో రానున్న ఐఫోన్ SE 4 మోడల్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iPhone SE 4 : ప్రపంచ టెక్ దిగ్గజం Apple సరసమైన ఐఫోన్ల లైనప్‌లో iPhone SE కొత్త జనరేషన్ డిజైన్ పరంగా మెయిన్ అప్‌డేట్స్ పొందడానికి రెడీగా ఉంది. కొత్త ఐఫోన్ SE పెద్ద డిస్‌ప్లేను పొందుతుందని భావిస్తున్నారు కానీ, ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ స్మార్ట్‌ఫోన్‌తో వచ్చే అవకాశం లేకపోవచ్చు.

iPhone SE 4 : ఐఫోన్ XR డిజైన్‌తో రానున్న ఐఫోన్ SE 4 మోడల్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iPhone SE 4 may feature same design as iPhone XR, new leaks reveal

iPhone SE 4 : ప్రపంచ టెక్ దిగ్గజం Apple సరసమైన ఐఫోన్ల లైనప్‌లో iPhone SE కొత్త జనరేషన్ డిజైన్ పరంగా మెయిన్ అప్‌డేట్స్ పొందడానికి రెడీగా ఉంది. కొత్త ఐఫోన్ SE పెద్ద డిస్‌ప్లేను పొందుతుందని భావిస్తున్నారు కానీ, ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ స్మార్ట్‌ఫోన్‌తో వచ్చే అవకాశం లేకపోవచ్చు. ఐఫోన్ SE 4 ఐఫోన్ XR మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

డిస్ప్లే సైజు చివరకు 4.7-అంగుళాల నుంచి 6.1-అంగుళాలకు పెరగనుంది. పెద్ద డిస్‌ప్లేతో సరసమైన ఐఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే యూజర్లకు ప్రధాన అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. లేటెస్ట్ డేటాను టిప్‌స్టర్ జోన్ ప్రోసెర్ షేర్ చేశారు. Apple ప్రొడక్టులకు సంబంధించినంత వరకు చాలా అరుదుగా రివీల్ చేస్తుంటారు. ఐఫోన్ SE 4 2018 iPhone XR మాదిరిగానే అదే డిజైన్‌తో వస్తుందని Prosser Youtube ఛానెల్‌లో షేర్ చేశారు.

iPhone SE 4 may feature same design as iPhone XR, new leaks reveal

iPhone SE 4 may feature same design as iPhone XR, new leaks reveal

SE సిరీస్ ఫోన్‌లు డేటెడ్ డిజైన్‌ను కలిగి ఉన్నాయని, లేటెస్ట్ ప్రాసెసర్‌ల ద్వారా పవర్ అందిస్తాయని తెలిపారు. మొదటి జనరేషన్ ఐఫోన్ SE ఐఫోన్ 5S వలె అదే డిజైన్‌ను కలిగి ఉంది. ఆ తర్వాత రెండవ, మూడవ జనరేషన్ ఐఫోన్ SE ఐఫోన్ 8 మాదరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంది. ఐఫోన్ SE 4వ జనరేషన్ చివరకు హోమ్ బటన్‌ను డిలీట్ చేస్తుందని ప్రోసెర్ గతంలో అంచనా వేసింది. మందపాటి బెజెల్‌లు, హోమ్ బటన్‌కు సన్నని బెజెల్‌లను కలిగి ఉన్నాయని తెలిపింది. అంతేకాదు.. ఈ ఐఫోన్ పెద్ద బ్యాటరీతో కూడా రావచ్చు.

చిప్‌సెట్ విషయానికొస్తే.. కొత్త ఐఫోన్ SE ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్‌కు పవర్ ఇచ్చే A15 బయోనిక్ చిప్‌సెట్‌ను కూడా పొందవచ్చు. A15 చిప్‌సెట్ కొన్ని iPhone 14 మోడల్‌లలో కూడా వస్తుందనే పుకార్లు ఉన్నాయి. కెమెరా విభాగంలో, iPhone XR ఒకే 12-MP సెన్సార్‌ను కలిగి ఉంది. iPhone XR తర్వాత తీసుకుంటే.. iPhone SEలో కూడా ఇలాంటి కాన్ఫిగరేషన్‌లను చూడవచ్చు. ప్రస్తుత జనరేషన్ iPhone SE ఒకే 8-MP సెన్సార్‌ను కలిగి ఉంది. బ్యాటరీ, సైజు పరంగానే కాకుండా కెమెరా సెన్సార్ పరంగా కూడా భారీ అప్‌గ్రేడ్‌తో వచ్చింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone SE 3 Price : భారత్‌లో iPhone SE 3 ధర పెరిగింది.. ఇందులో నిజమెంత?!