iPhone Users on WhatsApp : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్ మాట్లాడుతూనే మల్టీ టాస్క్ చేసుకోవచ్చు..!

WhatsApp iPhone Users : ఆపిల్ ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ iOS బీటా యూజర్లకు వీడియో కాల్‌ల చేసేందుకు ఈ కొత్త పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది.

iPhone Users on WhatsApp : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్ మాట్లాడుతూనే మల్టీ టాస్క్ చేసుకోవచ్చు..!

iPhone users to soon get this much-awaited WhatsApp feature

iPhone Users on WhatsApp : ఆపిల్ ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ iOS బీటా యూజర్లకు వీడియో కాల్‌ల చేసేందుకు ఈ కొత్త పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సాప్ వీడియో కాల్‌లో ఉన్నప్పుడు ఒకేసారి ఇతర యాప్‌లను ఓపెన్ చేసి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా, ఈ కొత్త ఫీచర్ కొంతమంది iOS బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. WABetaInfo ప్రకారం.. iOS 22.24.0.79 అప్‌డేట్ లేటెస్ట్ WhatsApp బీటాను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది బీటా iOS బీటా టెస్టర్‌ల కోసం WhatsApp కొత్త పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్‌ను రిలీజ్ చేసింది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ మరింత మంది ఐఫోన్ వాడే వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ అంటే ఏమిటి? :
WABetaInfo రిలీజ్ చేసిన కొత్త ఫీచర్ ప్రకారం.. ఈ కొత్త పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ యూజర్లకు వాట్సాప్ (WhatsApp Video Call) వీడియో కాల్‌లో ఉన్నప్పుడు ఆ ఫోన్‌లో మల్టీటాస్క్ చేసేందుకు అనుమతిస్తుంది. వీడియో కాల్ సమయంలో, యూజర్లు తమ WhatsApp యాప్‌ను మూసివేస్తే.. అది పిక్చర్-ఇన్-పిక్చర్ వ్యూ వెంటనే మెయిన్ విండోలో డిస్‌ప్లే అవుతుంది.

ఐఫోన్ యూజర్లు వీడియో కాల్ విండోను మూసివేయకుండా లేదా వారి సొంత కెమెరాను పాజ్ చేయకుండా ఫోన్‌లో ఇతర యాప్‌లను ఉపయోగించేందుకు ఈ ఫీచర్ సాయపడుతుంది. వాట్సాప్ వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా వీడియో కాల్ వ్యూను ఆఫ్ లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.

iPhone users to soon get this much-awaited WhatsApp feature

iPhone users to soon get this much-awaited WhatsApp feature

Read Also : WhatsApp Chat Filter : వాట్సాప్‌ చాట్ లిస్టులో మీరు చూడని మెసేజ్‌లను ఈజీగా ఇలా ఫిల్టర్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

అదనంగా, పిక్చర్-ఇన్ పిక్చర్ మోడ్ ప్రస్తుతం iOS 16.1, ఆ తర్వాతి వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్ iOS 16కి అధికారిక సపోర్టును అందించే అప్‌డేట్‌తో సపోర్ట్ చేసే ఫీచర్‌లలో ఒకటి కానుంది. iOS 15 పవర్డ్ డివైజ్‌లకు సపోర్ట్‌ను రిలీజ్ చేసేందుకు వాట్సాప్ (WhatsApp) కూడా పని చేస్తోంది.

వాట్సాప్ వీడియో కాల్‌ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ ఇప్పటికే Android యూజర్లకు అందుబాటులో ఉంది. వాట్సాప్ షేర్ చేసిన వీడియో ఫైల్‌లను చూసేందుకు పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను ఆన్ చేసేందుకు Android, iOS యూజర్లను WhatsApp అనుమతిస్తుంది. వాట్సాప్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను ఆన్ చేసేందుకు డివైజ్ సెట్టింగ్‌లు> యాప్‌లు, నోటిఫికేషన్‌లు> WhatsApp> అధునాతన < పిక్చర్-ఇన్-పిక్చర్‌కి వెళ్లండి.

WhatsApp మరొక కొత్త అప్‌డేట్‌ను కూడా టెస్టింగ్ చేస్తోంది. అదృశ్యమవుతున్న మెసేజ్‌లపై (disappearing messages) షార్ట్ కట్ ఐకాన్ రాబోతోంది. ఈ ఐకాన్ ద్వారా మరిన్ని ఆప్షన్లను యాడ్ చేస్తోంది. అదనంగా, మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ కూడా 8 ఎమోజీలను రీడిజైన్ చేసి లాంచ్ చేసింది. వినియోగదారుల మెసేజింగ్ ఎక్స్ పీరియన్స్ పొందడానికి మరో 21 కొత్త ఎమోజీలను యాడ్ చేస్తోంది. ఎమోజి అప్‌డేట్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ బీటా బిల్డ్‌లో అందుబాటులో ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!