IPL 2023 Season : రిలయన్స్ జియో కొత్త ఐపీఎల్ క్రికెట్ ప్లాన్లు ఇవే.. రోజుకు డేటా ఎంతంటే? ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

IPL 2023 Season : : ఐపీఎల్ 2023 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు టెలికం దిగ్గజాలు తమ కస్టమర్లకు అనేక కొత్త ప్లాన్లను అందిస్తున్నాయి.

IPL 2023 Season : రిలయన్స్ జియో కొత్త ఐపీఎల్ క్రికెట్ ప్లాన్లు ఇవే.. రోజుకు డేటా ఎంతంటే? ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

IPL 2023 _ Reliance Jio introduces new cricket plans providing 3GB data per day

IPL 2023 Season : ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023 Season) మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు టెలికం దిగ్గజాలు తమ కస్టమర్లకు అనేక కొత్త ప్లాన్లను అందిస్తున్నాయి. ముకేష్ అంబానీ (Mukesh Ambani) యాజమాన్యంలోని రిలయన్స్ జియో (Reliance Jio) రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 కోసం జియో యూజర్లకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది.

జియో కొత్త ప్లాన్‌లతో అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. కస్టమర్‌లు ఇబ్బంది లేకుండా మ్యాచ్‌లను వీక్షించేందుకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. భారత క్రికెట్ అభిమానులంతా అత్యంత ఎదురుచూసే క్రికెట్ ఈవెంట్‌లలో (IPL 2023) ఒకటి. షెడ్యూల్ ప్రకారం.. ఈ సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. ఈ కొత్త జియో ప్లాన్‌లతో లైవ్ క్రికెట్ మ్యాచ్‌ల హై క్వాలిటీలో వీక్షించవచ్చు.

Read Also : Apple AirPods Pro 2 : USB టైప్-C పోర్టుతో ఆపిల్ ఎయిర్ ప్యాడ్స్ ప్రో 2 వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

జియో క్రికెట్ ప్లాన్‌ ధర, బెనిఫిట్స్ ఇవే :
రిలయన్స్ జియో అందించే లేటెస్ట్ క్రికెట్ ప్లాన్‌లు మల్టీ కెమెరా యాంగిల్స్‌తో (4K) రిజల్యూషన్‌లో లైవ్ IPL మ్యాచ్‌లకు స్సెషల్ యాక్సెస్‌ను అందిస్తాయి. ఈ ప్లాన్‌లలో రూ. 219, రూ. 399, రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లన్నీ జియో ట్రూ 5G (Jio True 5G) డేటాకు సపోర్టు అందిస్తాయి. దాంతో స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా, 3 ప్యాక్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 3GB డేటా పొందవచ్చు. జియో రూ. 219 ప్లాన్ 14 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది.

IPL 2023 _ Reliance Jio introduces new cricket plans providing 3GB data per day

IPL 2023 _ Reliance Jio introduces new cricket plans providing 3GB data per day

జియో యూజర్లకు 3GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్‌లు, రోజుకు 100 SMS లిమిట్ అందిస్తుంది. JioTV, JioCinema, JioSecurity, JioCloudకి యాక్సెస్‌తో పాటు అదనంగా 2GB డేటాపై రూ. 25 వోచర్‌ను కూడా పొందవచ్చు. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాల్సిన యూజర్లకు రూ. 319 ప్లాన్, రూ. 219 ప్లాన్ మాదిరిగానే బెనిఫిట్స్ అందిస్తుంది. కానీ, ఈ ప్లాన్ 28 రోజుల పాటు వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది.

అదనంగా, ఈ ప్లాన్‌లో రూ. 61 ఫ్రీ వోచర్ కూడా ఉంది. అదనంగా 6GB డేటాను పొందవచ్చు. రూ. 999 ప్లాన్ 84 రోజుల వరకు వ్యాలిడిటీ పొందవచ్చు. రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాల్‌లు ఎంజాయ్ చేయొచ్చు. జియో యూజర్లు JioCinema, JioSecurity, JioCloud, JioTVతో సహా Jio యాప్‌ల సూట్‌కు కూడా యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రూ. 241 ఫ్రీ వోచర్ కూడా పొందవచ్చు. జియో యూజర్లు అదనంగా 40GB డేటా వరకు పొందవచ్చు.

Read Also : iQoo 9 SE Price Cut : ఐక్యూ 9 SE ఫోన్ ధర తగ్గిందోచ్.. అద్భుతమైన ఫీచర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!