iQOO Neo 7 Pro : 50MP కెమెరాతో ఐక్యూ నియో 7 ప్రో వచ్చేస్తోంది.. జూలై 4నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iQOO Neo 7 Pro : గత ఏడాదిలో చైనాలో లాంచ్ అయిన నియో 7 రేసింగ్ ఎడిషన్ రీబ్యాడ్జ్ వెర్షన్‌గా వస్తోంది. ఈ ఫోన్ iQOO నియో 7 ప్రో Snapdragon 8+ Gen 1 SoC ద్వారా పవర్ అందిస్తుంది.

iQOO Neo 7 Pro : 50MP కెమెరాతో ఐక్యూ నియో 7 ప్రో వచ్చేస్తోంది.. జూలై 4నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iQOO Neo 7 Pro confirmed to launch in India on July 4

iQOO Neo 7 Pro : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐక్యూ (iQOO) నుంచి నియో 7 ప్రోని భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. వచ్చే జూలై 4న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. గత ఫిబ్రవరిలో లాంచ్ అయిన నియో 7 తర్వాత ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. iQOO నియో 7ప్రో మోడల్ స్పెసిఫికేషన్‌లను కంపెనీ రివీల్ చేయలేదు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్-కేంద్రీకృత యూజర్లను లక్ష్యంగా చేసుకుంది. రాబోయే ఫోన్ iQOO Neo 7 ప్రో మోడల్ అని చెప్పవచ్చు. ఈ నెల ప్రారంభంలో (MySmartPrice) నియో 7 ప్రో, నియో 7 రేసింగ్ ఎడిషన్ రీబ్యాడ్జ్ వెర్షన్ అని నివేదించింది. గత ఏడాదిలో చైనాలో ఈ మోడల్ లాంచ్ అయింది. Neo 7 రేసింగ్ ఎడిషన్‌లో Neo 8 5Gలో లేని అదనపు కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Read Also : ChatGPT App for iPhones : ఈ 12 దేశాల్లోని ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్.. ఇందులో భారత్ ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..!

iQOO Neo 7 Pro ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Qualcomm Snapdragon 8+ Gen 1 SoC, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. SoC నియో 7లో డైమెన్సిటీ 8200 5G కన్నా గణనీయమైన అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.

iQOO నియో 7 ప్రో, నియో 7 రేసింగ్ ఎడిషన్ రీబ్రాండెడ్ వెర్షన్ అయితే, వెనుకవైపు 3 కెమెరా సెన్సార్‌లను కలిగి ఉండవచ్చు. కెమెరా సిస్టమ్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. ముందు ప్యానెల్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు.

iQOO Neo 7 Pro confirmed to launch in India on July 4

iQOO Neo 7 Pro confirmed to launch in India on July 4

5G, ఆండ్రాయిడ్ 13-ఆధారిత Funtouch OS 13, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్, డ్యూయల్-సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, స్టీరియో స్పీకర్లు, 16GB వరకు RAM+, 256GB స్టోరేజీ వంటి ఇతర ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. స్పెసిఫికేషన్ల ప్రకారం, iQOO నియో 7 ప్రో ధర సుమారు రూ. 40వేలు ఉండవచ్చు. అదే సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. iQOO నియో 7 ప్రో మోడల్ కూడా నియో 7 మాదిరిగానే కనిపిస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ గ్లాస్ లాంటి ఎండ్ అందిస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరాలను మాడ్యూల్‌లో కలిగి ఉండనుంది.

Read Also : Best Smartphones in June 2023 : రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే? పూర్తి వివరాలు మీకోసం..!