iQOO Neo 7 SE : మిడ్-రేంజ్ అప్‌గ్రేడ్ వెర్షన్.. లాంచ్‌కు ముందే.. ఐక్యూ నియో 7 SE స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఫీచర్లు లీక్..!

iQOO Neo 7 SE : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నుంచి కొత్త మిడ్-రేంజ్ అప్‌గ్రేడ్ వెర్షన్ రాబోతోంది. వచ్చే డిసెంబర్ 2న అధికారికంగా ఐక్యూ నియో 7 SE (iQOO Neo 7 SE) స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది.

iQOO Neo 7 SE : మిడ్-రేంజ్ అప్‌గ్రేడ్ వెర్షన్.. లాంచ్‌కు ముందే.. ఐక్యూ నియో 7 SE స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఫీచర్లు లీక్..!

iQOO Neo 7 SE full specifications leaked online ahead of December 2 launch

iQOO Neo 7 SE : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నుంచి కొత్త మిడ్-రేంజ్ అప్‌గ్రేడ్ వెర్షన్ రాబోతోంది. వచ్చే డిసెంబర్ 2న అధికారికంగా ఐక్యూ నియో 7 SE (iQOO Neo 7 SE) స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. అధికారిక ప్రకటనకు ముందే iQOO Neo 7 SE ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. కంపెనీ ఈ ఏడాది మేలో iQOO Neo 6 SEని ఆవిష్కరించింది. ఆరు నెలల తర్వాత, మిడ్-రేంజ్ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. iQOO Neo 7 SE డిసెంబర్ 2న చైనాలో లాంచ్ కానుందని నివేదిక వెల్లడించింది. భారత మార్కెట్లో iQOO Neo 7 SE లాంచ్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు.

కానీ, భారతీయ మార్కెట్‌కు కూడా ఈ ఫోన్ వస్తుందని భావిస్తున్నారు. iQOO Neo 6 దేశంలో iQOO Neo 6 SE లాగానే దాదాపు ఒకే ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. iQOO నియో 7 కూడా గత నెలలో చైనాలో లాంచ్ అయింది. రెండు ఫోన్‌లు రాబోయే నెలల్లో భారత మార్కెట్లో లాంచ్ అవుతాయా లేదా అందులో ఒకటి మాత్రమే లాంచ్ అవుతుందా అనేది క్లారిటీ లేదు. రాబోయే వారాల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. రాబోయే iQOO Neo 7 SE ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి స్మార్ట్‌ఫోన్ TENAA లిస్టింగ్‌లో గుర్తించారు. iQOO Neo 7 SE 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండనుందని వెల్లడించింది. ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పాటు 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది.

iQOO Neo 7 SE full specifications leaked online ahead of December 2 launch

iQOO Neo 7 SE full specifications leaked online ahead of December 2 launch

Read Also : iQOO Neo 7 Price : డైమన్షిటీ 9000+ SoCతో ఐక్యూ నియో 7 వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

మిడ్-రేంజ్ 5G ఫోన్ MediaTek Dimensity 8200 octa-core SoC ద్వారా పనిచేస్తుంది. గరిష్టంగా 16GB LPDDR5 RAM, 512GB UFS 3.1 స్టోరేజీతో రావొచ్చు. iQOO Neo 7 SE ముందున్న దానితో పోలిస్తే.. హుడ్ కింద కొంచెం పెద్ద బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. మిడ్-రేంజ్ ఫోన్ 4,700mAh బ్యాటరీ నుంచి 4,8880mAh యూనిట్‌ను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. కంపెనీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుందని నివేదిక తెలిపింది. ఫాస్ట్ ఛార్జర్‌తో కూడా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆప్టిక్స్ పరంగా చూస్తే.. 64-MP ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. 8-MP సెన్సార్‌కు బదులుగా 2-MPకెమెరా ఉండవచ్చు. మూడవది కూడా 2-MP సెన్సార్ కూడా ఉంది. మాక్రో షాట్‌ల కోసం కావచ్చు. ఈ 2-MP సెన్సార్లతో రియల్ లైఫ్‌లో ఎలాంటి ఉపయోగం లేదని చెప్పవచ్చు. కానీ, iQOO Neo 7 SE అధికారిక ఫీచర్లు కాదు. కంపెనీ డిసెంబర్ 2న ఫీచర్లు ఏం ఉండనున్నాయో వెల్లడించే అవకాశం ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iQOO 11 5G : ఐక్యూ 11 5G ఫోన్ కీలక ఫీచర్లు లీక్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?