iQOO Z6 5G : సరసమైన ధరకే iQOO Z6 స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. చీప్ అండ్ బెస్ట్ ఇదే..!

iQOO Z6 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం iQOO బ్రాండ్ నుంచి 5G సరికొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్‌ (Amazon)లో డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది.

iQOO Z6 5G : సరసమైన ధరకే iQOO Z6 స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. చీప్ అండ్ బెస్ట్ ఇదే..!

Iqoo Z6 5g Is Available At An Effective Price Of Rs 12,999 Here’s How The Deal Works

iQOO Z6 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం iQOO బ్రాండ్ నుంచి 5G సరికొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్‌ (Amazon)లో డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 120Hz FHD+ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ ఫీచర్లతో వస్తుంది. ఈ ఏడాది మార్చిలో iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. కొన్ని వారాల తర్వాత ఈ స్మార్ట్ ఫోన్‌పై ధర తగ్గింది.

ప్రస్తుతం భారత మార్కెట్లో iQOO Z6 5G ధర రూ. 15,499 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. కానీ, మీరు ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.13,999కే పొందవచ్చు. రూ. 1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కానీ, అయితే ఈ ఫోన్‌పై అమెజాన్ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ఈ iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే.. రూ. 1,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఈ బ్యాంకు కార్డ్‌ ద్వారా iQOO Z6 5G (4GB RAM + 128GB స్టోరేజ్)ని రూ. 12,999 ధరతో కొనుగోలు చేసుకోవచ్చు. మీకు ఛార్జర్ కూడా కావాలంటే.. ఫోన్ అసలు ధర రూ. 15,499 చెల్లించాల్సి ఉంటుంది.

Iqoo Z6 5g Is Available At An Effective Price Of Rs 12,999 Here’s How The Deal Works (1)

Iqoo Z6 5g Is Available At An Effective Price Of Rs 12,999 Here’s How The Deal Works 

iQOO Z6 5G : స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఇవే :
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ రెస్పాన్స్ రేట్, 90.61 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోకి సపోర్టు ఇస్తుంది. 6.58-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. ఇక ప్యానెల్ పూర్తి HD+ రిజల్యూషన్‌తో రన్ అవుతుంది. హుడ్ కింద, iQOO Z6 6nm క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ప్రాసెసర్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఐదు-లేయర్డ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో వచ్చింది. CPU టెంపరేచర్ సుమారు 10 డిగ్రీలు, బ్యాక్ ప్యానెల్ ఉపరితల ఉష్ణోగ్రతను 3 డిగ్రీల వరకు తగ్గించగలదు అని iQOO కంపెనీ వెల్లడించింది.

iQOO Z6 5G సాధారణ 5,000mAh బ్యాటరీతో వచ్చింది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. రెండు గంటల్లో 100% ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. కెమెరాల విషయానికి వస్తే.. 50-MP ప్రైమరీ కెమెరా, 2-MP మాక్రో కెమెరా 2-MP బోకె కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.

Read Also : Apple Smart Bottles : ఆపిల్ సరికొత్త స్మార్ట్‌ వాటర్ బాటిల్స్‌.. ఇక డివైజ్‌లతో కనెక్టింగ్ ఈజీ.. ధర ఎంతంటే?