iQOO Z7 Launch in India : భారత్‌కు ఐక్యూ Z7 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

iQOO Z7 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO 11, iQOO Neo 7 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ iQOO Z6, iQOO Z7 అప్‌గ్రేడ్ వెర్షన్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది.

iQOO Z7 Launch in India : భారత్‌కు ఐక్యూ Z7 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

iQOO Z7 expected to launch in India soon, poster teased online_ check out expected specifications and price

iQOO Z7 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO 11, iQOO Neo 7 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ ఇప్పుడు iQOO Z6, iQOO Z7 అప్‌గ్రేడ్ వెర్షన్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. iQOO Z6 మోడల్ ఆగస్టు 2022లో చైనాలో అధికారికంగా లాంచ్ అయింది. iQoo Z6, iQoo Z6xతో సహా రెండు వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్ వచ్చింది. iQOO Z6 Lite సెప్టెంబర్ 2022లో లాంచ్ అయింది.

సోషల్ మీడియాలో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు లాంచ్‌కు సంబంధించి వివరాలను iQOO ఇండియా CEO నిపున్ మరియా పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ Z- సిరీస్‌లో భాగం కాగా.. iQOO Z7 అనే పేరుతో రానుంది. రెండు సెన్సార్‌లతో రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక సైడ్ ఫొటోతో పాటు OIS కూడా ఉంది. iQOO బ్రాండింగ్ కింది ప్యానెల్ మధ్యలో ఉంది. స్మార్ట్‌ఫోన్ టీల్ కలర్‌లో కనిపిస్తోంది.

Read Also : Vivo V27 Series : వివో V27 సిరీస్ వచ్చేస్తోంది.. మార్చి 1నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, భారత మార్కెట్లో దీని ధర ఎంత? స్పెసిఫికేషన్ల గురించి ఇంకా డేటా రివీల్ చేయలేదు. ప్రైస్‌బాబా సహకారంతో ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ, iQOO Z7 మోడల్ నంబర్‌లు I2207, I2213తో QOO Z7 5G, iQOO Z7 Pro 5Gతో సహా రెండు వేరియంట్‌లలో వస్తుందని వెల్లడించారు.

iQOO Z7 expected to launch in India soon, poster teased online_ check out expected specifications and price

iQOO Z7 expected to launch in India soon, poster teased online

డివైజ్‌లకు I2207, I2213 అనే కోడ్‌నేమ్ పెట్టారు. చైనాలో iQOO iQOO Z7, iQOO Z7x మోడల్ లాంచ్ చేస్తోంది. ఇటీవల భారత మార్కెట్లో iQOO Neo 7ను లాంచ్ చేసింది. బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.29,999గా ఉంటుంది. భారత్‌లో12GB RAM, 256GB స్టోరేజ్‌తో టాప్ మోడల్ ధర రూ.33,999గా ఉంది. iQOO Neo 7 Full-HD+ (2400×1080 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.

iQOO Neo 7 మోడల్ ఫోన్ UFS 3.1 స్టోరేజ్, LPDDR5 RAM టెక్నాలజీతో MediaTek డైమెన్సిటీ 8200 SoC ద్వారా శక్తిని అందిస్తుంది. గేమింగ్ సెషన్‌లలో స్మార్ట్‌ఫోన్‌ను కూల్ ఉండేందుకు బిగ్ స్టీమ్ రూంతో పాటు మల్టీ -లేయర్ గ్రాఫైట్ షీట్‌లు ఉన్నాయి. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. iQOO Neo 7 గత ఏడాది మోడల్ మాదిరిగానే OISతో 64-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అయితే, కొత్త ఎడిషన్‌లో మెరుగైన ఫొటోలను అందించే కొత్త సెన్సార్‌ని కలిగి ఉండనుంది.

Read Also : Reliance GAP Store : హైదరాబాద్‌లో ఫస్ట్ ఫ్రీ-స్టాండింగ్ రిలయన్స్ ‘గ్యాప్’ స్టోర్‌ వచ్చేసిందోచ్.. ఇక్కడ అన్నిరకాల బ్రాండ్లు లభించును..!