android tvs : అతితక్కువ ధరతో ఇటెల్ స్మార్ట్ టీవీలు

android tvs : అతితక్కువ ధరతో ఇటెల్ స్మార్ట్ టీవీలు

Itel

android tvs ఇటెల్ సంస్థ తన టీవీ పోర్ట్‌ఫోలియోను భారతదేశంలో విస్తరిస్తూ నాలుగు కొత్త టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. జి-సిరీస్ కింద కంపెనీ వాటిని లాంచ్ చేసింది. వీటిలో అనేక అధునాతన ఫీచర్లు, కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. 32 అంగుళాల నుండి 55 అంగుళాల వరకు పరిమాణ ఎంపికలలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీల ప్రారంభ ధర రూ .16,999 గా ఉంది.
పూర్తిగా భారతదేశంలో తాయారు అయ్యాయని, ప్రీమియం స్మార్ట్ టీవీలకు అప్‌గ్రేడ్ కావాలనుకునే వినియోగదారుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించినట్లు ఇటెల్ వెల్లడించింది.

కొత్త స్మార్ట్ టీవీలలో 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 4కె అల్ట్రా-బ్రైట్ డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 24 డబ్ల్యూ స్టీరియో సౌండ్, ఫ్రేమ్‌లెస్ డిజైన్ వంటి ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉందని వెల్లడించింది.
అలాగే కనెక్టివిటీ కోసం, Wi-Fi, HDMI పోర్ట్, USUB పోర్ట్ మరియు బ్లూటూత్ 5.0 కూడా అందుబాటులో ఉంది. అలాగే మోడల్ ను బట్టి 2 జీబీ నుండి 8 జీబీ ర్యామ్ వరకు స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. ఈ టీవీలలో ఇన్ బిల్ట్ స్టెబిలైజర్ సపోర్ట్‌ కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇవే కాకుండా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా 4 లక్షలకు పైగా సినిమాలు, ప్రోగ్రామ్స్ ను ఆస్వాదించవచ్చు.