పక్క సీటులో పిల్లలు ఉన్నారు జాగ్రత్త : విమానంలో బేబీ సీట్ మ్యాప్ ఫీచర్ 

బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వెళ్లే ప్రయాణికుల్లో రెండేళ్ల చిన్నారుల వరకు ఎలాంటి టికెట్ ఉండదు. వారికి ప్రత్యేకించి సీటు అక్కర్లేదు. కానీ, ఈ విమానంలో మాత్రం బేబీ సీటు మ్యాప్ ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.

  • Published By: sreehari ,Published On : September 28, 2019 / 11:43 AM IST
పక్క సీటులో పిల్లలు ఉన్నారు జాగ్రత్త : విమానంలో బేబీ సీట్ మ్యాప్ ఫీచర్ 

బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వెళ్లే ప్రయాణికుల్లో రెండేళ్ల చిన్నారుల వరకు ఎలాంటి టికెట్ ఉండదు. వారికి ప్రత్యేకించి సీటు అక్కర్లేదు. కానీ, ఈ విమానంలో మాత్రం బేబీ సీటు మ్యాప్ ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.

బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వెళ్లే ప్రయాణికుల్లో రెండేళ్ల చిన్నారులకు ఎలాంటి టికెట్ ఉండదు. వారికి ప్రత్యేకించి సీటు అక్కర్లేదు. తల్లిదండ్రులు తమ చంటి పిల్లలను తమపైనే కూర్చొబెట్టుకుని ప్రయాణిస్తుంటారు. చిన్న పిల్లలతో ప్రయాణం చేసే సమయంలో 8 రోజుల పిల్లల నుంచి రెండేళ్ల వయస్సు పిల్లలు తరచూ ఏడుస్తుంటారు. దీంతో పక్క సీటులో కూర్చొన్న ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడుతుంటారు. పిల్లల అరుపులతో విసుగు పుట్టి చిరాకు పడుతుంటారు. విమాన ప్రయాణం భారంగా ఫీల్ అవుతుంటారు. విమానం ఎప్పుడు దిగుతామా?అని ఎదురుచూస్తుంటారు.   

గోల చేయొద్దని చంటి పిల్లలకు చెప్పినా అర్థం కాదు.. పోను తల్లిదండ్రులకు చెప్పాలంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోలేక తమలోనే తాము బాధపడుతుంటారు. సాధారణంగా టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో పక్క సీటులో లేడీస్ లేదా జెన్స్ ఉన్నారో లేదో చెక్ చేసుకుంటారు. లేడీ ఉంటే లేడీస్ సీటు.. జెన్స్ ఉంటే వారి పక్కన సీటు ఎంచుకుంటుంటారు. అది ప్రయాణికుల కంపర్ట్ కోసం ఇలా చేస్తుంటారు. కానీ, ప్రయాణాల్లో పక్క సీటులో పిల్లలు ఉన్నారా లేదో చెక్ చేయలేం. ఎందుకుంటే.. వారికి టికెట్.. ప్రత్యేకించి సీటు ఉండదు. విమానాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. 

విమాన ప్రయాణికుల సౌకర్యార్థం జపాన్ ఎయిర్ లైన్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే.. బేబీ సీటు ఫీచర్. దీని ద్వారా పక్క సీటులో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. ఫ్లయిట్ టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే 8 రోజుల నుంచి రెండేళ్ల వయస్సు ఉన్న పిల్లల వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. పిల్లలతో ప్రయాణించే వారి సీటు పక్కన ఇతర ప్రయాణికులు తమ కంపర్ట్ ను బట్టి సీటు బుకింగ్ చేసుకోవచ్చు. 

ఇందుకు బేబీ మ్యాప్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విమానంలో సీటు బుకింగ్ చేసుకునే సమయంలో వారు బుక్ చేసుకునే సీటులో ఎవరైనా చిన్నారులు ఉన్నారో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈ బేబీ సీటు మ్యాప్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు.

పిల్లలతో ఇబ్బంది లేదు అనుకునేవారు పక్క సీటు బుక్ చేసుకోవచ్చు. పిల్లల గోల పడలేం కాస్త దూరంగా ఉండే సీటు బుక్ చేసుకుందాం అనేవారికి ఈ ఫీచర్ ఎంతో రిలీఫ్ అని చెప్పవచ్చు. విమానంలో బేబీ సీటు మ్యాప్ ఫీచర్ ప్రవేశపెట్టడంపై నెటిజన్లు పన్నీ కామెంట్లు పెడుతున్నారు. పిల్లల గోల పడలేని ప్రయాణికులు చెవుల్లో హెడ్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.