చందమామను చుట్టేద్దాం రండీ.. నాతో ఎవరొస్తారు? 8 మందికి ఛాన్స్..

చందమామను చుట్టేద్దాం రండీ.. నాతో ఎవరొస్తారు? 8 మందికి ఛాన్స్..

SpaceX moon flight looking for 8 people : చందమామను చుట్టేద్దాం రమ్మంటున్నాడో జపాన్ బిలియనీర్.. 8 మందికి మాత్రమే ఛాన్స్ ఉందంట.. అందులోనూ లిమిటెడ్ సీట్స్ అంటున్నాడు.. ఎవరైతే ముందుగా అప్లయ్ చేసుకుంటారో వారికే సీటు రిజర్వ్ చేస్తాడంట.. ఈ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూద్దాం అంటున్నాడు. మూన్ మిషన్ లో భాగంగా మొట్టమొదటిసారిగా పౌరులకు చంద్రయానం చేసేందుకు అవకాశం దొరికింది. ఎప్పటిలాగా ప్రొఫెషనల్ వ్యోమగాములకే అవకాశం ఉండేది..
ఇప్పుడు సామాన్యులకు కూడా ఈ ఛాన్స్ ఇస్తానంటున్నాడు.. జపాన్ బిలియనీర్ Yusaku Maezawa. 2023లో తాను చేపట్టబోయే ఈ మూన్ మిషన్ లో ఎవరూ పాల్గొంటారో చెప్పాలంటున్నాడు.

తనతో పాటు చంద్రుని చుట్టేసి వచ్చేందుకు 8 మంది కావాలంటున్నాడు. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ సిస్టమ్ ద్వారా హెవీ పేలోడ్స్ తో పౌరులను చంద్రునిపైకి తీసుకెళ్లేందుకు మిషన్ మొదలు పెట్టేశాడు.

ఈ మిషన్ లో మొత్తం 10 నుంచి 12 మంది వరకు వెళ్లొచ్చు.. చంద్రునిపైకి వెళ్లి తిరిగి భూమికి తిరిగి రావాల్సి ఉంటుంది. చందమామ టూర్ లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మార్చి 14 నాటికి మిగిలిన 8 సీట్లలో ఏదైన ఒకటి ఎంపిక చేసుకోనే ఛాన్స్ ఉందంట. చంద్రయానానికి ముందుగా మిషన్ లో పాల్గొనే 8 మందికి మెడికల్ చెకప్, ఫైనల్ ఇంటర్వ్యూలను మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది.

డియర్ మూన్ అనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను మొదటిసారిగా 2018లోనే ప్రకటించారు. అంతరిక్షానికి వెళ్లేందుకు తనతో పాటు ఆర్టిస్టులను మాత్రమే Maezawa తీసుకెళ్తానని అప్పుడే పేర్కొన్నారు. అయితే మిషన్ లో ఎవరు వెళ్లాలి అనేదానిపై కొన్ని మార్పులు చేశారు. ప్రపంచంలోని పౌరులందరికి ఈ ఇన్విటేషన్ అందడమే తన ఉద్దేశమని, వారిలో ఎవరూ తనతో కలిసి మూన్ జెర్నీ చేసేందుకు అవకాశాన్ని దక్కించుకుంటారో చూడాలని అంటున్నాడు.