Courage And Civility : రోదసీ యాత్ర తర్వాత ‘కరేజ్ అండ్‌ సివిలిటీ’ అవార్డు ప్రకటించిన బెజోస్!

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రోదసియాత్రను విజయవంతమైంది. సొంత కంపెనీ ‘బ్లూ ఆరిజిన్‌’ రూపొందించిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో రోదసీ యాత్ర ముగిసిన అనంతరం బెజోస్ కీలక ప్రకటన చేశారు.

Courage And Civility : రోదసీ యాత్ర తర్వాత ‘కరేజ్ అండ్‌ సివిలిటీ’ అవార్డు ప్రకటించిన బెజోస్!

Jeff Bezos Gives Away $200 Million To Recognize 'courage And Civility' On Earth (1)

Courage And Civility : ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రోదసియాత్రను విజయవంతమైంది. అంతరిక్షంలోకి వెళ్లిరావాలనే తన లైఫ్ డ్రీమ్‌ను సాధించుకున్నారు. సొంత కంపెనీ ‘బ్లూ ఆరిజిన్‌’ రూపొందించిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో రోదసీ యాత్ర ముగిసిన అనంతరం బెజోస్ కీలక ప్రకటన చేశారు. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సందర్భంగా ‘courage and civility’ అనే అవార్డుని ప్రకటించారు.

ఈ తొలి అవార్డును ప్రముఖ చెఫ్‌ (Jose Andres) జోస్‌ ఆండ్రెస్‌, సామాజిక కార్యకర్త వ్యాన్‌ జోన్స్‌ (Van Jones) అనే గ్రహితలకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు కింద ఇరువురికి 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 746.02 కోట్లు) ఇవ్వనున్నారు.

ప్రజలకు సాయం చేయడంలో ముందుండి నడిచేవారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఈ అవార్డు సొమ్మును అవసరమైతే ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వొచ్చని బెజోస్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మందికి ఈ అవార్డులు ప్రదానం చేయాలని భావిస్తున్నట్టు బెజోస్ స్పష్టం చేశారు.

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. స్పేస్ టూరిజం లక్ష్యంగా జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కొనసాగింది. బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో జెఫ్ బెజోస్ బృందం రోదసీలోకి వెళ్లొచ్చింది. ప్యారాచూట్ల ఉన్న క్యాప్సూల్స్ ద్వారా భూమిపైకి బెజోస్ బృందం సురక్షితంగా ల్యాండ్ అయింది. బెజోస్ తో పాటు రోదసీలోకి 82ఏళ్ల మహిళా పైలట్ వేలీ ఫంక్, 18ఏళ్ల ఓలివర్ డేమన్ మొత్తం ముగ్గురు పర్యాటకులు వెళ్లారు.

100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఈ వ్యోమనౌక వెళ్లింది. తద్వారా తొలి వాణిజ్య వ్యోమనౌక ద్వారా బ్లూ ఆరిజన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కర్మన్ రేఖ దాటి రోదసీలోకి బెజోస్ బృందం ప్రవేశించింది. భూమి నుంచి 106 కిలోమీటర్లు ఎత్తుకు ప్రయాణించింది. బెజోస్ తో పాటు అంతరిక్షంలోకి అడుగుపెట్టిన వేలిఫంక్ అతిపెద్ద వయస్సురాలు, అలాగే 18ఏళ్ల కుర్రాడుగా ఓలివెర్ డేమన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు.

భార రహిత స్థితిలో 4 నిమిషాలు బెజోస్ టీమ్ గడిపింది. అంతరిక్ష యాత్ర ముగించుకుని విజయవంతంగా భూమిపైకి జెఫ్ బెజోస్ టీమ్ చేరుకుంది. గరిష్ట ఎత్తుకు చేరుకున్న తర్వాత క్యాప్సుల్ వెనుదిరిగింది. పారాచ్యూట్ సాయంతో ఎడారి ప్రాంతంలో సురక్షితంగా బెజోస్ టీమ్ ల్యాండ్ అయింది.