Jio 5G Data Plans : మీ ఫోన్లలో జియో 5G నెట్‌వర్క్.. వెంటనే ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోండి.. 5G డేటా స్పీడ్, OTT బెనిఫిట్స్ మీకోసం..

Jio 5G Data Plans : రిలయన్స్ జియో భారత మార్కెట్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం ఆపరేటర్ నాలుగు భారతీయ నగరాల్లో 5G కనెక్టివిటీని అందిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో నివసించే Jio వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

Jio 5G Data Plans : మీ ఫోన్లలో జియో 5G నెట్‌వర్క్.. వెంటనే ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోండి.. 5G డేటా స్పీడ్, OTT బెనిఫిట్స్ మీకోసం..

Jio 5G available on your phone Recharge with these plans to get 5G data speed with OTT benefits

Jio 5G Data Plans : రిలయన్స్ జియో భారత మార్కెట్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం ఆపరేటర్ నాలుగు భారతీయ నగరాల్లో 5G కనెక్టివిటీని అందిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో నివసించే Jio వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 5G రెడీ ఫోన్‌లలో దశలవారీగా 5G కనెక్టివిటీని పొందవచ్చు. ప్రస్తుత 4G SIM 5G కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది.

కొత్త 5G SIMని పొందాల్సిన అవసరం లేదని Jio వినియోగదారులకు హామీ ఇచ్చింది. 5G ప్లాన్‌లు ఏమి ఉన్నాయో తెలుసా? మీరు మీ జియో SIMలో 5G కనెక్టివిటీని పొందారో లేదో చెక్ చేసుకోండి. మీ 5G స్మార్ట్‌ఫోన్ ఆటోమేటిక్‌గా Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ 5G ఆఫర్ కింద Jio యూజర్లు 1 Gbps వరకు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.

వెల్‌కమ్ ఆఫర్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ సిమ్‌లపై రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ బేస్ ప్లాన్‌ని యూజర్లకు మాత్రమే వ్యాలిడిటీ అందిస్తుంది. Jio వెల్‌కమ్ ఆఫర్ కోసం.. ఇన్వైట్ చేసిన Jio True 5G కస్టమర్‌లు, 1 Gbps స్పీడ్‌తో UNLIMITED 5G డేటాను పొందవచ్చు. Jio కస్టమర్ ప్రీపెయిడ్, యాక్టివ్ బేస్ ప్లాన్ రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే పని చేస్తుంది. పోస్ట్‌పెయిడ్ యూజర్లు జియో అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Jio 5G available on your phone Recharge with these plans to get 5G data speed with OTT benefits

Jio 5G available on your phone Recharge with these plans to get 5G data speed

Jio 5G కనెక్టివిటీని పొందిన మొదటి యూజర్లలో మీరు ఒకరు అయితే.. మీ 5G నెట్‌వర్క్ నుంచి పొందవచ్చు. కొన్ని Jio పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఇక్కడ ఉన్నాయి. ఈ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు 1Gbps వేగంతో ఉచిత 5G డేటాను అందిస్తాయి. అంతేకాదు. మీరు ఫ్రీ OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. మీకు ఇష్టమైన సినిమాలు లేదా సిరీస్‌లను 5G స్పీడ్‌తో పొందవచ్చు. OTT బెనిఫిట్స్ ద్వారా Jio 5G అర్హత పొందిన పోస్ట్‌పెయిడ్ లిస్టును మీకోసం అందిస్తున్నాం.

జియో రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
5G నెట్‌వర్క్ గరిష్టంగా 1Gbps హై-స్పీడ్ డేటాతో పాటు, ఈ ప్లాన్ రోజుకు 100 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, Netflix, Amazon Prime, Disney+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.

జియో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS, అదనపు జియో సిమ్‌ను అందిస్తుంది.

జియో రూ. 799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద.. Jio అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్లను అందిస్తుంది.

Jio 5G available on your phone Recharge with these plans to get 5G data speed with OTT benefits

Jio 5G available on your phone Recharge with these plans to get 5G data speed

జియో రూ 999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఫ్యామిలీ ప్లాన్ కింద 3 జియో సిమ్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తాయి.

జియో రూ. 1,499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఎంపిక చేసిన నగరాల్లో అంతర్జాతీయ కాల్స్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, భారతీయ నెట్‌వర్క్‌లకు రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best Jio Plans : రూ. 500 లోపు బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. మరెన్నో బెనిఫిట్స్.. రోజుకు డేటా ఎంతంటే?