Jio 5G on iPhone : మీ ఐఫోన్‌లో ఇప్పటికీ జియో 5G సపోర్టు చేయడం లేదా? ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.. జియో 5G ఫుల్ లిస్ట్ మీకోసం..!

Jio 5G on iPhone : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) కొత్త iOS 16.2 అప్‌డేట్‌తో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) వినియోగదారులకు 5G సపోర్టును అందిస్తోంది.

Jio 5G on iPhone : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) కొత్త iOS 16.2 అప్‌డేట్‌తో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) వినియోగదారులకు 5G సపోర్టును అందిస్తోంది. అందులో ఆపిల్ ఐఫోన్ మోడళ్లలో iPhone X, iPhone 11, iPhone SE (సెకండ్ జనరేషన్ అంతకంటే ఎక్కువ) కొత్త iPhone 14 సిరీస్‌లతో సహా Apple iPhone మోడల్‌లు కొత్త iOS వెర్షన్‌తో సిస్టమ్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత 5G ఎనేబుల్ అవుతుంది. అయితే, మీరు 5G అందుబాటులో ఉన్న నగరంలో నివసిస్తున్నప్పటికీ లేటెస్ట్ సిస్టమ్ అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసినప్పటికీ, మీరు iPhoneలో Jio అందించే 5G సర్వీసులను ఉపయోగించలేకపోవచ్చు. ఎందుకంటే Jio 5G కేవలం 5G ఇన్విటేషన్ అందుకున్న జియో యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

దేశంలో 5G ప్రారంభ సమయంలో.. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ భారతీయ నగరాల్లో దశలవారీగా 5Gని రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఎంపిక చేసిన యూజర్లు మాత్రమే కొత్త నెట్‌వర్క్ కనెక్టివిటీలో చేరగలరని ప్రకటించారు. Jio True 5Gలో చేరేందుకు టెల్కో వెల్‌కమ్ ఆఫర్‌తో స్పెషల్ ఇన్విటేషన్ పంపవచ్చు. 5G ఆహ్వానాన్ని స్వీకరించిన iPhone యూజర్లు సపోర్టు ఉన్న iPhone మోడల్‌లలో Jio 5Gని యాక్టివేట్ చేయడం ద్వారా Jio అందించే 5వ జనరేషన్ టెక్నాలజీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయవచ్చు. ఇంకా అందకపోతే మరికొంత కాలం ఆగాల్సిందే.

Jio 5G ఇన్విటేషన్ ఎలా చెక్ చేయాలంటే? :
మీ iPhone మోడల్‌లో iOS 16.2తో అప్‌డేట్ చేసి.. ఇంకా ఇన్విటేషన్ మెసేజ్ అందుకోకపోతే, Jio 5G మీకు అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోండి. అందుకు మీరు MyJio యాప్‌కి వెళ్లండి. MyJio యాప్‌లో 5Gతో పాటు వెల్‌కమ్ ఆఫర్ (Welcome Offer) నోటిఫికేషన్ లేదా ప్రాంప్ట్ వస్తుంది. లేదంటే.. మీరు మరికొన్ని వారాలు వేచి ఉండాల్సి ఉంటుంది.

Jio 5G on iPhone _ Still not able to use Jio 5G on your iPhone_

Read Also : Reliance Jio 5G : గుజరాత్‌లోని అన్ని నగరాల్లోకి జియో ట్రూ 5G సర్వీసులు.. యూజర్లు ఉచితంగా 1Gbps డేటా యాక్సస్ చేసుకోవచ్చు..!

జియో వెల్‌కమ్ ఆఫర్ (Jio Welcome Offer) అంటే ఏమిటి?
Jio వెల్‌కమ్ ఆఫర్ కింద, యూజర్లు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ముఖ్యంగా, అర్హత ఉన్న యూజర్లు రూ. 239, అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్‌కు మెంబర్‌షిప్ పొందినట్లయితే మాత్రమే జియో 5Gని ఉపయోగించవచ్చునని జియో స్పష్టంగా పేర్కొంది. మీరు రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ ప్లాన్‌ని కలిగి ఉండవచ్చు.

Jio 5G సపోర్ట్ చేసే iPhoneల లిస్టు ఇదే :

* iPhone 12 Mini
* iPhone 12
* iPhone 12 Pro
* iPhone 12 Pro Max
* iPhone 13 Mini
* iPhone 13
* iPhone 13 Pro
* iPhone 13 Pro Max
* iPhone SE 2022 (3rd gen)
* iPhone 14
* iPhone 14 Plus
* iPhone 14 Pro
* iPhone 14 Pro Max

ఏయే నగరాల్లో Jio 5G అందుబాటులో ఉందంటే..? :
రిలయన్స్ జియో (Reliance Jio) తన 5Gని ప్రధాన భారతీయ నగరాల్లో వేగంగా రిలీజ్ చేస్తోంది. (Jio True 5G) టెలికాం ఆపరేటర్ ఇప్పటికే ఢిల్లీ-NCR, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, నాథ్‌ద్వారా, గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో 5వ జనరేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీ సర్వీసులను అందిస్తోంది. రిలయన్స్ జియో కూడా Jio True 5G, Jio True 5G పవర్డ్ Wi-Fi సర్వీసులను మహాకాళేశ్వర జ్యోతిర్లింగంలో, శ్రీ మహాకాళ మహాలోక్‌లో ప్రారంభించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G – Airtel 5G : భారతీయ నగరాల్లో జియో – ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు