Amazon Prime Plans : జియో, ఎయిర్‌టెల్, Vi ప్లాన్లపై అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఆఫర్.. మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్.. ఇదిగో లిస్టు మీకోసం..!

Amazon Prime Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్ టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vodafone Idea (Vi)) ఎంపిక చేసిన ప్లాన్‌లపై Amazon Prime వీడియో ఫ్రీ మెంబర్‌షిప్ అందిస్తున్నాయి.

Amazon Prime Plans : జియో, ఎయిర్‌టెల్, Vi ప్లాన్లపై అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఆఫర్.. మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్.. ఇదిగో లిస్టు మీకోసం..!

Jio, Airtel, Vodafone plans offering free Amazon Prime membership List of plans, benefits

Amazon Prime Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్ టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vodafone Idea (Vi)) ఎంపిక చేసిన ప్లాన్‌లపై Amazon Prime వీడియో ఫ్రీ మెంబర్‌షిప్ అందిస్తున్నాయి. టెలికాం ఆపరేటర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ ఇంటర్నెట్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా OTT యాప్‌లకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యాక్సస్ పొందవచ్చు.

ఈ ప్లాన్‌లు యూజర్లకు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్‌లిమిటెడ్ సినిమాలు, టీవీ షోలకు యాక్సెస్‌ను అందిస్తాయి. OTTలో రీజనల్ కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు. అయితే, Jio, Airtel, Vi అందించే అన్ని Amazon Prime వీడియోల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను వివరంగా ఓసారి పరిశీలిద్దాం.

Jio Plans – Free Amazon Prime Membership :

జియో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌పై అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

రూ. 399 ప్లాన్ : ఈ ప్లాన్ ఫస్ట్ బిల్లింగ్ సైకిల్‌కు మొత్తం 75 GB డేటాను అందిస్తుంది. ఆ తర్వాత ఒక్కో GBకి రూ. 10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు OTT మెంబర్‌షిప్ అందిస్తుంది.

రూ. 599 ప్లాన్ : ఈ ప్యాక్ 200GB డేటాతో 100GB డేటాను అందిస్తుంది. ఆ తర్వాత 1 GBకి రూ. 10 ఫ్లాట్ రేట్‌తో అందిస్తుంది. OTT బెనిఫిట్స్‌ కింద నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు.

రూ. 799 ప్లాన్ : యూజర్లు మొత్తం 150GB డేటా బెనిఫిట్ క్యాప్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు 200GB ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ల డేటా అందిస్తుంది.

రూ. 999 ప్లాన్ : ఈ ప్లాన్ 1GBకి రూ.10తో మొత్తం 200GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. Netflix, Amazon Prime, Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా పొందవచ్చు.

రూ. 1,499 ప్లాన్ : ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 300 GB డేటా ఉంటుంది. ఆ తర్వాత GBకి రూ. 10, 500GB డేటాను పొందవచ్చు. OTT బండిల్‌లో Netflix, Amazon Prime, Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌లు కూడా పొందవచ్చు.

Jio, Airtel, Vodafone plans offering free Amazon Prime membership List of plans, benefits

Jio, Airtel, Vodafone plans offering free Amazon Prime membership List of plans, benefits

Airtel Plans – Free Amazon Prime Membership :

Airtel ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో Amazon Prime వీడియోలకు ఫ్రీగా మెంబర్ షిప్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లపై అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తాయి.

రూ. 499 ప్లాన్ : యూజర్లు నెలవారీ బిల్లింగ్ సైకిల్‌తో మొత్తం 75 GB డేటాను పొందవచ్చు. అదనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు OTT సభ్యత్వాన్ని అందిస్తుంది.

రూ. 999 ప్లాన్ : ఈ ప్లాన్ నెలవారీ రెంటల్స్‌లో 100GB డేటాను అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌కు OTT బెనిఫిట్స్ ద్వారా ఫ్రీగా సభ్యత్వాన్ని అందిస్తుంది.

రూ. 1199 ప్లాన్ : ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లకు OTT సబ్‌స్క్రిప్షన్‌తో నెలవారీ బిల్లింగ్ సైకిల్‌పై మొత్తం 150 GB డేటాను అందిస్తుంది.

రూ. 1499 ప్లాన్ : Airtel నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో 200 GB మొత్తం డేటాను అందిస్తుంది.

Jio, Airtel, Vodafone plans offering free Amazon Prime membership List of plans, benefits

Jio, Airtel, Vodafone plans offering free Amazon Prime membership List of plans, benefits

Vodafone Idea Plans – Free Amazon Prime Membership :

వోడాఫోన్ ఐడియా 501 లేదా అంతకంటే ఎక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌పై Amazon Prime వీడియోలకు ఫ్రీగా సభ్యత్వాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 3000 SMSలు పొందవచ్చు.

రూ. 501 ప్లాన్ : ఈ ప్లాన్ మొత్తం నెలకు 90GB డేటాతో పాటు Amazon Prime, Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.

రూ. 701 ప్లాన్ : ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌కు అన్‌లిమిటెడ్ డేటాతో పాటు సబ్‌స్క్రిప్షన్‌లు పొందవచ్చు.

రూ. 1101 ప్లాన్ : ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అమెజాన్ ప్రైమ్, సోనీ LIV ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు అన్‌లిమిటెడ్ డేటాతో సబ్‌స్క్రిప్షన్‌లు పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus Phones : ఈ వన్‌ప్లస్ ఫోన్లలో 5G సపోర్టు కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వస్తోంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!