Jio vs Vi Offers : జియో vs వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్లపై ఫెస్టివల్ డీల్స్.. లిమిటెడ్ ఆఫర్.. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి!

Jio vs Vi Offers : ప్రముఖ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), Vodafone Idea (Vi) యూజర్ల కోసం దీపావళి ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. దీపావళి ముగిసినప్పటికీ పండుగ ఆఫర్ ఇప్పటికీ అందుబాటులోనే ఉంది.

Jio vs Vi Offers : జియో vs వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్లపై ఫెస్టివల్ డీల్స్.. లిమిటెడ్ ఆఫర్.. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి!

Jio vs Vi Offers : ప్రముఖ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), Vodafone Idea (Vi) యూజర్ల కోసం దీపావళి ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. దీపావళి ముగిసినప్పటికీ పండుగ ఆఫర్ ఇప్పటికీ అందుబాటులోనే ఉంది. OTT బెనిఫిట్స్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించే ప్రత్యేక ప్లాన్‌లతో యూజర్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. Jio, Vi ద్వారా అందుబాటులో ఉన్న పండుగ ప్లాన్‌లను ఓసారి పరిశీలిద్దాం.

జియో దీపావళి సెలబ్రేషన్ ఆఫర్ :
రిలయన్స్ జియో ప్రత్యేక దీపావళి సెలబ్రేషన్ ఆఫర్‌ను రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్‌పై ప్రవేశపెట్టింది. దీపావళి ఆఫర్ కింద.. ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లతో 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజుకు 100 SMSలను అందిస్తుంది. యూజర్లు 2.5GB రోజువారీ డేటా లిమిట్‌తో ఏడాదికి 912GB డేటాను పొందవచ్చు. అంతేకాదు.. Jio 75GB అదనపు డేటాతో పాటు JioTV, JioCinema, JioSecurity, JioCloud కాంప్లిమెంటరీ సర్వీసులను కూడా అందిస్తోంది.

జియో దీపావళి సెలబ్రేషన్ ఆఫర్‌లో జూమిన్ నుంచి ఫ్రీగా మాగ్నెట్‌లు, ఎయిర్‌లైన్ బుకింగ్‌పై Ixigoపై రూ. 750 తగ్గింపు, Ajioపై రూ. 1,000 తగ్గింపు, అర్బన్ లాడర్‌పై రూ. 1,500 తగ్గింపు, రిలయన్స్ డిజిటల్‌పై రూ. 1,000 తగ్గింపు కూడా ఉన్నాయి. Jio ప్లాన్‌పై అదనపు డేటా బెనిఫిట్స్ పొందాలంటే ఫ్రీ డిస్కౌంట్ వోచర్‌లను ప్రవేశపెట్టింది. ఆఫర్ లిమిటెడ్ పిరియడ్ మాత్రమే ఉంటుంది. అతి త్వరలో ఈ ఆఫర్ ముగియనుంది.

Jio and Vi are offering festive deals on recharge plans but the offers are ending soon

Jio and Vi are offering festive deals on recharge plans but the offers are ending soon

Vi దీపావళి ఆఫర్లు :
వోడాఫోన్ ఐడియా (Vi) దీపావళి ఆఫర్‌ల కింద 3 ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అక్టోబర్ 31 వరకు యూజర్లకు అదనపు డేటా బెనిఫిట్స్ ఫ్రీగా పొందవచ్చు.

Vi రూ 1,449 ప్లాన్ : 180 రోజుల వ్యాలిడిటీతో పాటు ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. యూజర్లు 50GB అదనపు డేటాతో పాటు 1.5 GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. ఆఫర్‌లో వారాంతపు డేటా రోల్‌ఓవర్ కూడా అందిస్తుంది. యూజర్లు వారాంతాల్లో అన్‌లిమిటెడ్ అమితంగా, స్ట్రీమింగ్ సెషన్‌ల కోసం ఉపయోగించని డేటాను అనుమతిస్తుంది.

Vi రూ 2,899 ప్లాన్ : ఈ ప్లాన్‌లు 365 రోజుల వ్యాలిడిటీతో 1.5 GB రోజువారీ డేటాను అందిస్తాయి. Vi ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో అదనపు 75GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, వారాంతపు డేటా రోల్ ఓవర్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.

Vi రూ 3,099 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB రోజువారీ డేటా లిమిట్, అదనపు 75GB డేటా బెనిఫిట్స్ ఉన్నాయి. దానితో పాటు యూజర్లు ఈ ప్రత్యేక పండుగ ఆఫర్‌తో ఒక ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : LinkedIn New Feature : లింక్‌డిన్‌లో కొత్త ఫీచర్.. ఫేక్ ప్రొఫైల్స్ ఇకపై ఈజీగా గుర్తుపట్టొచ్చు..!