Reliance Jio Offer : జియో బంపర్ ఆఫర్.. ఆ ప్లాన్లపై 20శాతం డిస్కౌంట్!

టెలికం దిగ్గజం జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఈ వారమే అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే జియో ప్రవేశపెట్టిన కొన్ని ప్లాన్లపై 20 శాతం క్యాష్ బ్యాక్ ప్లాన్‌లను సవరించింది.

Reliance Jio Offer : జియో బంపర్ ఆఫర్.. ఆ ప్లాన్లపై 20శాతం డిస్కౌంట్!

Jio Gives 20 Per Cent Cashback On Prepaid Plans Starting From Rs 299, Check All Revised Offers

Reliance Jio Offer : టెలికం దిగ్గజం జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఈ వారమే అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే జియో ప్రవేశపెట్టిన కొన్ని ప్లాన్లపై 20 శాతం క్యాష్ బ్యాక్ ప్లాన్‌లను సవరించింది. గతంలో రూ. 249, రూ. 555, రూ. 599గా
ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాన్లను ఎంచుకునే జియో యూజర్లు రూ. 200 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. రీఛార్జ్ చేసుకున్నమూడు రోజుల్లోనే యూజర్ల అకౌంట్లలోకి క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్ అవుతుందని జియో పేర్కొంది. రిలయన్స్ రిటైల్ ఛానెల్స్
అయిన Jio Recharge, JioMart, Reliance Smart, Ajio, Reliance Trends, Reliance Digital Netmeds వంటి ఇతర స్టోర్‌ల ద్వారా కూడా యూజర్లు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

జియో అందించే ఈ 20 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్.. రూ. 299, రూ. 666, రూ. 719 ప్లాన్లకు మాత్రమే వర్తిస్తుంది. రూ.299 ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాల్స్,అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లతో పాటు రోజుకు 100 SMS, 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా జియో యాప్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. రూ.666 ధరతో తదుపరి ప్లాన్ 1.5GB రోజువారీ డేటా అన్ లిమిటెడ్ కాల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMS Jio యాప్‌లను యాక్సెస్‌ చేసుకోవచ్చు. రూ.719 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 100 SMS అన్ లిమిటెడ్ కాల్‌లతో పాటు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. Jio యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లతో యూజర్లు రూ. 144 వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.

రూ. 719 ప్రీపెయిడ్ ప్లాన్ కాకుండా, జియో రూ.1199 ధర కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్‌ను 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ప్లాన్ 3GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకు 100 SMSలకు యాక్సెస్ చేసుకోవచ్చు. జియో యాప్‌లకు కూడా
యాక్సెస్ అందిస్తుంది. జియో రూ. 666 ధరతో మరో ప్లాన్‌ కూడా ఉంది. 84 రోజుల వ్యాలిడిటీతో 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. Jio యాప్‌లకు యాక్సెస్‌తో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ రోజుకు 100 SMSలను అందిస్తుంది. రూ. 329 రూ.
555 ధరతో జియో ప్లాన్‌లు వరుసగా రూ.395, రూ.666కి పెరిగాయి. ఇందులో రెండు ప్లాన్‌లకు అన్ లిమిటెడ్ కాల్‌లు రోజుకు 100 SMSలను పొందవచ్చు.

ఈ రెండు ప్లాన్లపై వరుసగా 6GB డేటా, 1.5GB రోజువారీ డేటాను పొందవచ్చు. Jio ప్లాన్లలో రూ. 499, రూ.666 రూ. 888 రీచార్జ్ చేసుకోవడం ద్వారా రోజువారీ డేటా 3GBవరకు పొందవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ కూడా అందిస్తోంది. జియో.. ఇప్పుడు నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 3GB వరకు డెయిలీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌ల ధర వరుసగా రూ. 419, రూ. 601, రూ. 1199 రూ.4199. రూ.419 రూ.601 ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్లలో అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, జియో యాప్‌లను యాక్సెస్‌ చేసుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రూ.601 ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ బెనిఫిట్‌తో ఏడాది పాటు వస్తుంది. ఈ ప్లాన్‌పై అదనంగా 6GB డేటాను ఆఫర్ చేస్తోంది.

Read Also : Airtel Free Data Offer : ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్.. రోజూ అదనంగా ఫ్రీ డేటా పొందొచ్చు!