Jio New Plans : జియో కొత్త 5 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. డేటాపై నో లిమిట్..!

భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల డేటాపై డెయిలీ లిమిట్ ఎత్తేసింది. అంటే.. రోజుంత ఎంతసేపు అయినా డేటా వాడుకోవచ్చు.

Jio New Plans : జియో కొత్త 5 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. డేటాపై నో లిమిట్..!

Jio New Plans

Jio Launches 5 New Prepaid Plans : భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల డేటాపై డెయిలీ లిమిట్ ఎత్తేసింది. అంటే.. రోజుంత ఎంతసేపు అయినా డేటా వాడుకోవచ్చు. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ. 127 నుంచి రూ. 2,397 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లు 15 రోజుల నుంచి 365 రోజుల వరకు వేర్వేరు వ్యాలిడిటీలతో అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ప్లాన్ లో రూ. 127 ప్రీపెయిడ్ ప్లాన్ 12GB డేటాను అందిస్తుంది.

టాప్-టైర్ రూ. 2,397 ప్లాన్ 365GB డేటాను అందిస్తుంది. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లలో Jio suite యాప్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత సబ్ క్రిప్షన్ అందిస్తున్నాయి. ఈ ప్లాన జాబితాను కంపెనీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ. 12 రోజుల 15 రోజుల వ్యాలిడిటీతో 12GBతో రోజువారీ డేటాను అందిస్తోంది. 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో ఇతర ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. జియో ఫ్రీడమ్ ప్లాన్లను మరిన్ని అందుబాటులోకి తెస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లకు 30 రోజుల మల్టిపుల్ వాలిడిటీ అందిస్తోంది. అంతకుముందు ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగా 28 రోజుల మల్టిపుల్ వాలిడిటీ అందిస్తోంది. ఐదు ప్లాన్ల రోజువారీ పరిమితి, అపరిమిత వాయిస్ కాలింగ్, స్థిరమైన డేటాను పొందవచ్చు. 30-రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ తేదీని గుర్తుపెట్టుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్లతో JioTV, JioCinema, JioNews సహా యుటిలిటీ యాప్ లను కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ ధర రూ. 247 రోజువారీ పరిమితులు లేకుండా 30 రోజులు వ్యాలిడిటీ పొందవచ్చు. దీనిపై 25GB డేటాను పొందవచ్చు. ఇతర ప్లాన్‌లో ధర రూ. 447 (60 రోజుల వ్యాలిడిటీ, 50GB డేటా), రూ. 597 (90 రోజుల వ్యాలిడిటీ, 75GB డేటా), రూ. 2,397 (365 రోజుల వ్యాలిడిటీ, 365GB డేటా)ను అందిస్తోంది. రూ. 98 జియో రీఛార్జ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు రోజువారీ 1.5GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ కింద JioTV, JioCinema, JioNews వంటి Jio యాప్ లకు కూడా యాక్సస్ చేసుకోవచ్చు.