Jio 5G Services : దేశవ్యాప్తంగా 191 నగరాల్లో రిలయన్స్ జియో 5G సర్వీసులు.. కొత్త మరో 7 నగరాల్లోకి..!

Jio 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ట్రూ 5G నెట్‌వర్క్‌ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దేశంలోని పలు నగరాల్లో షిల్లాంగ్, ఇంఫాల్, ఐజ్వాల్, అగర్తల, ఇటానగర్, కోహిమా, దిమాపూర్ అనే 7 నగరాలను కలుపుతూ ఈశాన్య సర్కిల్‌లోని 6 రాష్ట్రాలలో 5G సర్వీసులను ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించింది.

Jio 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ట్రూ 5G నెట్‌వర్క్‌ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దేశంలోని పలు నగరాల్లో షిల్లాంగ్, ఇంఫాల్, ఐజ్వాల్, అగర్తల, ఇటానగర్, కోహిమా, దిమాపూర్ అనే 7 నగరాలను కలుపుతూ ఈశాన్య సర్కిల్‌లోని 6 రాష్ట్రాలలో 5G సర్వీసులను ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 191 నగరాల్లో ట్రూ 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. డిసెంబర్ 2023 నాటికి, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, తాలూకాలో జియో ట్రూ 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటినుంచి అరుణాచల్ ప్రదేశ్ (ఇటానగర్), మణిపూర్ (ఇంఫాల్), మేఘాలయ (షిల్లాంగ్), మిజోరం (ఐజ్వాల్), నాగాలాండ్ (కోహిమా దిమాపూర్), త్రిపుర (అగర్తలా)లలోని ఏడు నగరాల్లో జియో సర్వీసులు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. Jio వెల్‌కమ్ ఆఫర్‌ కూడా ఆయా ప్రాంతాల్లోని జియో యూజర్లకు పంపనట్టు తెలిపారు. తద్వారా అదనపు ఖర్చు లేకుండా 1 Gbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను అనుభవించవచ్చు.

Jio Launches 5G Services in Seven Northeast Cities, Network Now Live in 191 Cities in India

Read Also : WhatsApp New Features : వాట్సాప్‌లో రాబోయే కొత్త ఫీచర్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే? పూర్తి వివరాలు మీకోసం..!

ట్రూ 5G అందించే అనేక ప్రయోజనాలలో, హెల్త్ ప్రొటెక్షన్ కూడా ఉందని జియో తెలిపింది. జియో కమ్యూనిటీ క్లినిక్ మెడికల్ కిట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ-వర్చువల్ రియాలిటీ (AR-VR) ఆధారిత హెల్త్‌కేర్ సొల్యూషన్స్ వంటి విప్లవాత్మక సొల్యూషన్‌లను అందించనుంది. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన హెల్త్‌కేర్‌ను మెరుగుపరుస్తాయని, మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించే దిశగా ప్రయత్నిస్తున్నామని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

జియో ప్రతినిధి మాట్లాడుతూ.. ఈరోజు నుంచి నార్త్ఈస్ట్ సర్కిల్‌లోని మొత్తం 6 రాష్ట్రాల్లో ట్రూ 5G సర్వీసులను ప్రారంభించినట్టు తెలిపింది. ఈ అధునాతన సాంకేతికత ఈశాన్య ప్రజలకు, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన ప్రయోజనాలను తెస్తుంది. నమ్మకమైన వైర్‌లెస్ నెట్‌వర్క్ నెట్‌వర్క్ వ్యవసాయం, విద్య, ఈ-గవర్నెన్స్, IT, SME, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, మరెన్నో వంటి వివిధ రంగాలను మెరుగుపరుస్తుందని ప్రతినిధి తెలిపారు. Jio True 5G బీటా నాలుగు నెలల లోపే 191 నగరాలకు చేరుకుందని ప్రతినిధి తెలిపారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Moto E13 Price in India : మోటోరోలా E సిరీస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడు? ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు