Jio True 5G Services : దేశవ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా మరో 41 నగరాల్లోకి.. జియో వెల్‌కమ్ ఆఫర్ ఫ్రీగా పొందాలంటే?

Jio True 5G Services : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు అనేక ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. కొత్తగా మరో 41 నగరాల్లోకి జియో ట్రూ 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో మీ నగరం ఉందేమో చెక్ చేసుకోండి.

Jio True 5G Services : దేశవ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా మరో 41 నగరాల్లోకి.. జియో వెల్‌కమ్ ఆఫర్ ఫ్రీగా పొందాలంటే?

Jio 5G roll out _ Reliance Jio True 5G reaches 41 more cities, customers can try for free

Jio True 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) దేశవ్యాప్తంగా తమ జియో ట్రూ 5G సర్వీసులను విస్తరిస్తోంది. మార్చి 21న (మంగళవారం) తన ట్రూ 5G సర్వీసులను కొత్తగా మరో 41 నగరాల్లోకి విస్తరించింది. దాంతో మొత్తంగా దేశంలో జియో ట్రూ 5G నెట్‌వర్క్ 406 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. కొత్తగా జియో 5G సర్వీసులు (Jio True 5G Services) అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో 16 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. తద్వారా తక్కువ వ్యవధిలో విస్తృత స్థాయిలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఏకైక టెలికాం ఆపరేటర్‌గా జియో అవతరించింది. జియో 5G సర్వీసులు ప్రారంభమైన ప్రాంతాల్లో ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నర్సాపూర్, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం (ఆంధ్రప్రదేశ్), మార్గోవ్ (గోవా), ఫతేహాబాద్, 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 41 కొత్త నగరాలు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది.

Read Also : Best Reliance Jio Plans : రిలయన్స్ జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. హైస్పీడ్ డేటా, మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

మరికొన్ని కొత్త నగరాల్లో గోహనా, హన్సి, నార్నాల్, పల్వాల్ (హర్యానా), పౌంటా సాహిబ్ (హిమాచల్ ప్రదేశ్), రాజౌరి (జమ్ము & కాశ్మీర్) దుమ్కా (జార్ఖండ్), రాబర్ట్‌సన్‌పేట్ (కర్ణాటక). అలాగే, ఇతర నగరాల్లో కన్హంగాడ్, నెడుమంగడ్,తాలిపరంబ, తలస్సేరి, తిరువల్ల (కేరళ), బేతుల్, దేవాస్, విదిషా (మధ్యప్రదేశ్) భండారా, వార్ధా (మహారాష్ట్ర), లుంగ్లే (మిజోరం), బైసనగర్, రాయగడ (ఒడిశా), హోషియార్‌పూర్ (పంజాబ్), టోంక్ (రాజస్థాన్), కారైకుడి, కృష్ణగిరి, రాణిపేట్, తేని అల్లీనగరం, ఉదగమండలం,వాణియంబాడి(తమిళనాడు), కుమార్‌ఘాట్ (త్రిపుర) ఉన్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తమ జియో ట్రూ 5Gని వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని జియో ప్రతినిధి ఒకరు తెలిపారు.

Jio 5G roll out _ Reliance Jio True 5G reaches 41 more cities, customers can try for free

Jio 5G roll out _ Reliance Jio True 5G reaches 41 more cities

జియో (True-5G) పరిధిని వేగంగా విస్తరిస్తోందని ఆయన అన్నారు. జియో వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 1Gbps+ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను Jio వెల్‌కమ్ ఆఫర్‌ (Jio Welcome Offer)ను కూడా ఉచితంగా పొందవచ్చునని జియో ప్రతినిధి పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో ప్రణాళికాబద్ధమైన True-5G నెట్‌వర్క్‌ను ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించింది.

దేశంలోని మెజారిటీ ప్రాంతాలను జియో ట్రూ 5G సర్వీసులను విస్తరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్, ఆకాష్ అంబానీ (Akash Ambani) మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం, తాలూకా, తహసీల్‌లను కవర్ చేసేలా జియో ట్రూ 5G సర్వీసులను విస్తరించడమే లక్ష్యంగా ముందుకు రిలయన్స్ జియో పయనిస్తోందని ఆకాంక్షించారు.

Read Also : Realme C55 Price : రూ. 10,999 ధరకే రియల్‌మి C55 ఫోన్.. టాప్ ఫీచర్లు ఇవే.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!