Jio Recharge WhatsApp : జియో యూజర్లు.. వాట్సాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.. ఎలానంటే?

రిలయన్స్ జియో యూజర్లు ఇప్పుడు తమ ఫోన్ నెంబర్లపై వాట్సాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. టెలికాం దిగ్గజం కొత్త వాట్సాప్ బాట్ రిలీజ్ చేసింది. జియో యూజర్ల అకౌంట్లను రీఛార్జ్ చేసుకోవచ్చు.

Jio Recharge WhatsApp : జియో యూజర్లు.. వాట్సాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.. ఎలానంటే?

Jio Users Can Now Recharge Accounts Via Whatsapp Heres How

Jio users recharge accounts via WhatsApp : రిలయన్స్ జియో యూజర్లు ఇప్పుడు తమ ఫోన్ నెంబర్లపై వాట్సాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. టెలికాం దిగ్గజం కొత్త వాట్సాప్ బాట్ రిలీజ్ చేసింది. జియో యూజర్ల అకౌంట్లను రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే పాత నంబర్‌ను జియోకు పోర్ట్ చేయడం నుంచి కొత్త సిమ్ వరకు అనేక సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి, రిలయన్స్ జియో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో 7000770007 నంబర్‌ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై వాట్సాప్ ద్వారా ఈ నంబర్‌కు ‘Hi’ అని పంపాల్సి ఉంటుంది.

రిలయన్స్ జియో.. వాట్సాప్ బోట్ సంస్థ అందించే సేవల జాబితాను అందిస్తుంది. ఇందులో కొత్త జియో సిమ్ లేదా పోర్ట్-ఇన్ ఉపయోగించి MNP, జియో సిమ్ రీఛార్జ్, జియో సిమ్‌కు సపోర్ట్, జియోఫైబర్‌కు సపోర్ట్ ఉంటుంది. అంతర్జాతీయ రోమింగ్‌కు సపోర్టు, వాట్సాప్ బోట్ ద్వారా జియోమార్ట్‌కు సపోర్టును కూడా యూజర్లు పొందవచ్చు. జియో సిమ్ రీఛార్జ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా యూజర్లు ఆటో-జనరేటెడ్ మెనూకు వెళ్లవచ్చు.

వివిధ రిలయన్స్ జియో ప్లాన్లు ఉంటాయి. ప్రతి ప్లాన్ గురించి వివరాలను యూజర్లు తెలుసుకోవచ్చు. నచ్చిన ప్లాన్ ను యూజర్లు ఎంచుకోవచ్చు. జియో యూజర్లు ఫోన్ రీఛార్జ్ కోసం అనేక డిజిటల్ మార్గాల ద్వారా చెల్లించవచ్చు. యుపిఐ, ఇ-వాలెట్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయి. రిలయన్స్ జియో యూజర్లు వాట్సాప్ బాట్‌ వాడే విషయంలో ఎదుర్కొంటున్న ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయవచ్చు.

వాట్సాప్ బోట్ కేవలం జియో సంబంధిత సర్వీసులకు మాత్రమే కాదు. ప్రధాన మెనూలో COVID-19 టీకాకు సంబంధించిన సమాచారాన్ని యూజర్లకు అందిస్తుంది. యూజర్లు వారి పిన్ కోడ్‌ను టైప్ చేయడం ద్వారా వారి లొకేషన్ సమీపంలో ఉన్న టీకా సెంటర్లను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ సర్వీసు హిందీ, ఇంగ్లీష్ రెండు భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది.