Jio Valentines Day Offer : జియో వ్యాలెంటైన్స్ డే ఆఫర్.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఫ్రీగా 87GB డేటా, మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Jio Valentines Day Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లపై కొత్త వ్యాలెంటైన్స్ డే ఆఫర్‌‌ను ప్రకటించింది.

Jio Valentines Day Offer : జియో వ్యాలెంటైన్స్ డే ఆఫర్.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఫ్రీగా 87GB డేటా, మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Jio Valentine’s Day Offer _ Up to 87GB free data and other benefits on Select Prepaid Plans

Jio Valentines Day Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లపై కొత్త వ్యాలెంటైన్స్ డే ఆఫర్‌ (Reliance Jio Valentine’s Day Offer)ను ప్రకటించింది. టెలికాం కంపెనీ 87GB వరకు మొబైల్ డేటా, విమాన బుకింగ్‌పై భారీ తగ్గింపు అందిస్తుంది. ఉచిత బర్గర్‌తో పాటు మరెన్నో అందిస్తోంది. లేటెస్ట్ ఆఫర్లపై కంపెనీ వెబ్‌సైట్, అధికారిక MyJio యాప్‌లో యాక్సస్ చేసుకోవచ్చు. లేటెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జియో వాలెంటైన్స్ డే ఆఫర్ 2023 బెనిఫిట్స్ :
రిలయన్స్ జియో యూజర్లు ఎంచుకున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 87GB వరకు ఉచిత మొబైల్ డేటాను పొందవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అధికారిక My Jio యాప్‌లో చూడవచ్చు. టెలికాం ఆపరేటర్ కేవలం ఒక జియో ప్లాన్‌తో 87GB ఉచిత డేటాను పొందవచ్చు. కొన్ని ప్యాక్‌లలో 12GB ఉచిత డేటా మాత్రమే ఉంటుంది. ఇతర బెనిఫిట్స్ కోసం ఇక్సిగోలో రూ. 4,500 లేదా అంతకంటే ఎక్కువ ఫ్లైట్ బుకింగ్‌లపై రూ. 750 తగ్గింపు పొందవచ్చు.

Jio Valentine’s Day Offer _ Up to 87GB free data and other benefits on Select Prepaid Plans

Jio Valentine’s Day Offer _ Up to 87GB free data and other benefits

ఫెర్న్స్, పెటల్స్ యాప్ నుంచి కనిష్టంగా రూ. 799 ఆర్డర్‌పై రూ. 150 తగ్గింపు పొందవచ్చు. రిలయన్స్ జియో యూజర్లు మెక్‌డొనాల్డ్స్‌లో రూ. 199 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే రూ. 105 విలువైన చికెన్ కబాబ్ లేదా మెక్‌ఆలూ టిక్కీ బర్గర్‌ను కూడా క్లెయిమ్ చేయవచ్చు. MyJio యాప్‌ని ఉపయోగించి అన్ని ఆఫర్‌ల కూపన్‌లను పొందవచ్చు.కూపన్ కోడ్‌ని పొందడానికి ఎవరైనా ఈ యాప్‌కి వెళ్లి ‘Coupons and Winnings’ ట్యాబ్‌కు నావిగేట్ చేయాలి.

Read Also : PAN-Aadhaar Link : మీ ఆధార్- పాన్ కార్డు ఇంకా లింక్ చేయలేదా? ఈ తేదీలోగా SMS ద్వారా వెంటనే లింక్ చేయండి.. ఇదిగో ప్రాసెస్..!

జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే :
రిలయన్స్ జియో రూ. 249, రూ. 349, రూ. 899, రూ. 2,999 సహా నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై వాలెంటైన్స్ డే ఆఫర్‌ను ప్రకటించింది. మొదటి ప్రీపెయిడ్ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా ప్లాన్ ఉంటుంది. 23 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రూ. 349 ప్రీపెయిడ్ జియో ప్లాన్ రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. రూ. 899 జియో ప్రీపెయిడ్ ప్లాన్ 2.5GB రోజువారీ డేటాతో వస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

రూ. 2,999 అనేది లాంగ్ టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్. 2.5GB రోజువారీ డేటాతో పాటు ఉచితంగా 87GB మొబైల్ డేటాతో వస్తుంది. ఈ డేటా ప్యాక్ ఒకసారి కొనుగోలు చేసిన 388 రోజుల పాటు వ్యాలిడిటీని పొందవచ్చు. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ కాల్‌లు, SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ప్రస్తుతం, జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లపై కొత్త ఆఫర్ గడువు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. పైన పేర్కొన్న ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న కస్టమర్‌లు MyJio App, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేయొచ్చు.

Read Also : Airtel Bulk Data Offers : ఎయిర్‌టెల్ కొత్త బల్క్ డేటా ప్లాన్లు.. ఫుల్ లిస్టు ఇదిగో.. మీకు నచ్చిన డేటా ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు!