Jio Airtel Plans : అత్యంత సరసమైన ధరకే జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ పోస్టుపెయిడ్ ప్లాన్లు.. మరెన్నో కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Jio vs Airtel Plans : రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) తమ యూజర్ల కోసం సరికొత్త పోస్టుపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. జియో, ఎయిర్‌టెల్ అత్యంత సరసమైన ధరలకు బెస్ట్ మొబైల్ పోస్ట్‌పెయిడ్ సర్వీసులను అందించేందుకు పోటీ పడుతున్నాయి.

Jio vs Airtel Plans _ Reliance Jio vs Airtel Rs 599 postpaid plan_ Data, calling, and other benefits compared
Jio Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాల్లో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) తమ యూజర్ల కోసం సరికొత్త పోస్టుపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ అత్యంత సరసమైన ధరలకు బెస్ట్ మొబైల్ పోస్ట్‌పెయిడ్ సర్వీసులను అందించేందుకు పోటీ పడుతున్నాయి. రెండు టెల్కోలు ఇటీవలే తమ పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌లలో అనేక మార్పులు తీసుకొచ్చాయి. తమ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌లను చేర్చాయి. OTT సర్వీసుల వంటి అదనపు బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
జియో, ఎయిర్‌టెల్ తమ పోస్ట్‌పెయిడ్ ఆఫర్లు వేర్వేరు అయినప్పటికీ.. ఒకే ధరకు అందిస్తున్నాయి. తమ కస్టమర్‌లను ఆకర్షించేందుకు ప్లాన్ల ధరలను దాదాపు ఒకేలా అందిస్తున్నాయి. రెండు టెల్కోలు ఒకే ధరతో అందించే ప్లాన్లలో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒకటి. జియో, ఎయిర్‌టెల్ రెండూ తమ రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో డేటా, కాలింగ్, OTT బెనిఫిట్స్ అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ అందించే రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం ఏ టెల్కో బెస్ట్ ప్లాన్లను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జియో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
రిలయన్స్ జియో రూ. 599 నెలవారీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, అన్‌లిమిటెడ్ డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది. వినియోగదారులు JioTV, JioCinema, Jio సినిమా, JioCloudతో సహా జియో యాప్‌లకు ఉచితంగా యాక్సస్ అందిస్తుంది. ఈ ప్లాన్ (Jio True 5G) యూజర్ల కోసం (Jio Welcome Offer) కింద వస్తుంది.

Jio Airtel Plans _ Reliance Jio vs Airtel Rs 599 postpaid plan_ Data, calling, and other benefits
అర్హత కలిగిన వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటా యాక్సెస్‌ను అందిస్తుంది. అదనంగా, Jio టెల్కో పోస్ట్‌పెయిడ్ సర్వీసులను పొందాలంటే.. మీరు ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారవచ్చు. కొత్త వినియోగదారులు లేదా కస్టమర్‌ల కోసం ఈ ప్లాన్ 30 రోజుల ఉచిత ట్రయల్‌ను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ ఇటీవల మొబైల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల జాబితా కింద Rs 599 ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. 75GB డేటా రోల్‌ఓవర్, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తోంది. కొత్త కనెక్షన్‌తో యూజర్లు 1 సాధారణ, 1 ఉచిత కుటుంబ యాడ్-ఆన్‌ల SIMని పొందవచ్చు. అదనంగా, ప్లాన్‌లలో అమెజాన్ ప్రైమ్ వీడియోలు (Amazon Prime Videos), డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఇతర బెనిఫిట్స్ ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నాయి. జియో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో 5G యాక్సెస్‌తో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది.
మరోవైపు, ఎయిర్‌టెల్ లిమిటెడ్ డేటాను అందిస్తుంది. కానీ, OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వాలతో ఎక్కువ డేటాను అందిస్తున్నాయి. అలాగే, OTT బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా, జియో యూజర్లు అదే అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ కోరుకుంటే.. OTT బెనిఫిట్స్ కావాలంటే రూ. 699 ఫ్యామిలీ ప్లాన్‌ని పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా ఉచిత ట్రయల్‌ను అందించడమే కాకుండా నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ బేసిక్ ప్లాన్ ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు.