JioPhone Next Price : దీపావళికి జియో ఫోన్ నెక్ట్స్..ధర ఎంతో తెలుసా

ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ ఈ ఏడాది దీపావళి నుంచి స్టోర్స్ లో అందుబాటులో ఉంటుందని శుక్రవారం ఈ ఫోన్ ను సంయుక్తంగా తయారుచేసిన

JioPhone Next Price : దీపావళికి జియో ఫోన్ నెక్ట్స్..ధర ఎంతో తెలుసా

Jio

JioPhone Next Price ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ ఈ ఏడాది దీపావళి నుంచి స్టోర్స్ లో అందుబాటులో ఉంటుందని శుక్రవారం ఈ ఫోన్ ను సంయుక్తంగా తయారుచేసిన జియో మరియు గూగుల్ కంపెనీలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ రీటైల్ నెట్ వర్క్ కు చెందిన జియోమార్ట్ డిజిటల్ రీటైల్ స్టోర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. జియో ఫోన్ నెక్ట్స్ ధరను రూ.6,499గా నిర్ణయించారు.

ఇక,ఈజీ ఈఎమ్ఐ లేదా ఫైనాన్స్ కింద ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1999గా ఉండనుండగా..మిగిలిన మొత్తాన్ని 18/24నెలల్లో కట్టవచ్చు. ప్రపంచంలోనే అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ గా జియో ఫోన్ నెక్ట్స్ నిలుస్తుందని శుక్రవారం రిలయన్స్ రిలయన్స్ చైర్మన్ ముఖేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా,భారతీయత కేంద్రబిందువుగా రూపుదిద్దుకున్న ఈ నూతన ఫోన్ ఇప్పటికే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

జియో ఫోన్ నెక్ట్స్ యొక్క కొన్ని విశిష్ట ఫీచర్లు:

వాయిస్ అసిస్టెంట్
ఈ ఉపకరణాన్ని వినియోగించడంలో వినియోగదారులకు వాయిస్ అసిస్టెంట్ తోడ్పడుతుంది. తమకు బాగా తెలిసిన భాషలో ఇంటర్నెట్ నుంచి సులభంగా సమాచారాన్ని, కంటెంట్ ను పొందడంలో సహకరిస్తుంది.

రీడ్ అలౌడ్
ఏ స్క్రీన్ పై అయినా సరే, కంటెంట్ ను బయటకు చదివి వినిపించేందుకు ‘లిజన్’ అనేది వినియోగదారులకు తోడ్పడుతుంది. తాము అర్థం చేసుకోగల భాషలో కంటెంట్ ను ఉపయోగించుకునేందుకు ఇది వినియోగదారు లకు వీలు కల్పిస్తుంది.

ట్రాన్స్ లేట్
‘ట్రాన్స్ లేట్’ అనేది ఏ స్క్రీన్ పై అయినా కూడా తాము ఎంచుకున్న భాషలోకి కంటెంట్ అనువాదం అయ్యేందుకు వినియోగదారులకు తోడ్పడుతుంది. వినియోగదారులు తాము ఎంచుకున్న భాషలో కంటెంట్ ను చదివేందుకు తోడ్పడుతుంది.
సులభమైన స్మార్ట్ కెమెరా
ఈ ఉపకరణం స్మార్ట్, శక్తివంతమైన కెమెరాతో ఉంటుంది. పోట్రయిడ్ మోడ్ వంటి వివిధ ఫోటోగ్రఫీ మోడ్స్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్ తో ఫోటోలను చక్కగా తీసేందుకు వీలు కల్పిస్తుంది. తక్కువ కాంతి ఉన్న సమయంలోనూ ఫోటోలను బాగా తీసేందుకు నైట్ మోడ్ వీలు కల్పిస్తుంది.

కెమెరా యాప్ కూడా ప్రీలోడెడ్ గా వస్తుంది. కస్టమ్ ఇండియన్ అగుమెంటెడ్ రియాలిటీ ఫీచర్లు ఆయా ఫోటోలను మరింతగా మెరుగుపరుస్తాయి. భావోద్వేగాలతో, వేడుకలతో జోడిస్తాయి.

ముందుగానే లోడ్ చేయబడిన జియో, గూగుల్ యాప్స్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని, ఉపయోగించగలిగిన అందుబాటులో ఉన్న అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ ను ఈ ఉపకరణం సపోర్ట్ చేస్తుంది. తద్వారా వారికి ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండే లక్షలాది యాప్స్ ను ఎంచుకునే స్వేచ్ఛను అందిస్తుంది. జియో, గూగుల్ యాప్స్ ఇందులో ముందుగానే లోడ్ చేయబడి ఉంటాయి.

ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్
జియో ఫోన్ నెక్ట్స్ ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంటుంది. దీన్ని వినియోగిస్తున్న కొద్దీ, ఆటోమేటిక్ గా అందించబడే అధునాతన ఫీచర్లతో అది మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. ఇబ్బందిరహిత అనుభూతిని అందించేందుకు వీలుగా సెక్యూరిటీ అప్ డేట్స్ కూడా వస్తాయి.

అద్భుతమైన బ్యాటరీ లైఫ్
ఆండ్రాయిడ్ తో శక్తివంతమైన, నూతనంగా డిజైన్ చేయబడిన ప్రగతి ఓఎస్ చక్కటి పనితీరుకు, అదే సమయంలో దీర్ఘకాలం ఉండే బ్యాటరీ జీవితానికి వీలు కల్పిస్తుంది.