JioPhone Next: దీపావళి సేల్‌లో జియోఫోన్.. తెలుసుకోవాల్సిన 5విషయాలు

గూగుల్‌తో పార్టనర్‌షిప్ సెట్ చేసుకున్న జియో ఫోన్ నెక్స్ దీపావళికి మార్కెట్లోకి వచ్చేస్తుంది. పైగా ఇది రూ.7వేల కంటే తక్కువ ధరకే దొరుకుతుండటం గమనార్హం.

JioPhone Next: దీపావళి సేల్‌లో జియోఫోన్.. తెలుసుకోవాల్సిన 5విషయాలు

Jio Phone Next

JioPhone Next: గూగుల్‌తో పార్టనర్‌షిప్ సెట్ చేసుకున్న జియో ఫోన్ నెక్స్ దీపావళికి మార్కెట్లోకి వచ్చేస్తుంది. పైగా ఇది రూ.7వేల కంటే తక్కువ ధరకే దొరుకుతుండటం గమనార్హం. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే యూజర్లకు పలు పేమెంట్ ఆప్షన్లతో అందిస్తుంది.

ధర:
ఇండియాలో JioPhone Next దాదాపు రూ.6వేల 499గా ఉంది. దీనిని ఈఎమ్ఐ ఆప్షన్లలో కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ముందుగా రూ.వెయ్యి 999 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని పలు ఇన్‌స్టాల్మెంట్లలో ఇస్తే సరిపోతుంది. రూ.300 నుంచి నెలవారీ వాయిదాలు మొదలవుతున్నాయి. దీపావళి సందర్భంగా నవంబర్ 4నుంచి రిలీజ్ చేయనున్నట్లు రిలయన్స్ జియో కన్ఫామ్ చేసింది.

ఇది కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే దగ్గర్లోని జియో మార్ట్ డిజిటల్ రిటైలర్ ను, వెబ్ సైట్ లోనూ సంప్రదించాలి. వాట్సప్ లోనూ రిజిష్టర్ చేసుకోవచ్చు. దానికోసం చేయాల్సిందల్లా.. 7018270182 నెంబర్ కు Hi అని పంపాలంతే.. అలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత కస్టమర్ దగ్గర్లోని జియో మార్ట్ కు వెళ్లి జియోఫోన్ నెక్స్ట్స కలెక్ట్ చేసుకోవచ్చు.

…………………………………….. : శృతి, కాజల్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా!

ఫీచర్లు ఇలా: 
* 5.5 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ ప్లే
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్
* క్వాడ్ కోర్ క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ QM-215 Soc ప్రోసెసర్
* 2GB, 32GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుండగా మెమొరీ కార్డ్ సాయంతో 512జీబీ వరకూ ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు.
* దీనికి 13మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాకు కూడా ఉంది.
* 3వేల 500మిల్లీ యాంపియర్ హవర్స్ బ్యాటరీకి 5వాట్ ఛార్జింగ్ తో ఉంది.
* డ్యూయెల్ సిమ్ ఫీచర్ ఉన్న ఫోన్ లో మొదటిది జియోతో లాక్ అయిపోయి ఉంటుంది.