Kia New SUV : కస్టమర్లను కట్టిపడేస్తున్న కియా కొత్త ఎస్యూవీ!
వాహన సంస్థలు కస్టమర్ల అభిరుచికి తగిన డిసైన్లతో మార్కెట్లోకి కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి.
Kia New SUV : వాహన సంస్థలు కస్టమర్ల అభిరుచికి తగిన డిసైన్లతో మార్కెట్లోకి కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా తన వాహన శ్రేణిలో కొత్త ఎస్‌యూవీని తీసుకురానుంది. ఈ కారుకు సంబంధించిన టీజర్నుకియా రిలీజ్ చేసింది. పేరును మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. తొలుత అమెరికన్ మార్కెట్లలో ఈ కారును అక్టోబర్ 27 న లాంచ్ చేయనున్నుట్లు తెలుస్తోంది.
చదవండి : Kia India: కియా ఇండియా నుంచి మరో సూపర్ మోడల్
భారత మార్కెట్లలోకి కియా న్యూ ఎస్యూవీ మోడల్‌ను 2022 ఏప్రిల్‌లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కియా కార్లలోని స్పోర్టేజ్ ఎస్యూవీ మోడల్‌కు కొత్త జనరేషన్ కారుగా ఈ కారు నిలుస్తోందని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ కారు ఫ్రంట్ వీల్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్‌తో రానుంది. కారులో మల్టీపుల్ స్టాండర్డ్ అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, హై టెక్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు.
చదవండి : Kia India: ఇండియాలో అత్యంత వేగంగా 3లక్షల కియా కార్ల సేల్స్
ఇంజిన్ విషయానికి వస్తే..!
కియా స్పోర్టేజ్ మోడల్ మాదిరిగానే 1.6 లీటర్ టర్బో ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. 177 బీహెచ్పీ సామర్థ్యంతో 265ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.