Koo ప్రత్యేకతలేంటీ ? ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి ?

Koo ప్రత్యేకతలేంటీ ? ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి ?

Koo App : ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా…Koo ను భారత్ లో అభివృద్ధి చేశారు. కొత్త యాప్ ను దేశంలో లక్షలాది మంది డౌన్ లోడ్ చేసేసుకుంటున్నారు. ఈ ఇండియన్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ను పలువురు ప్రముఖులు కూడా వాడుతున్నారు. ఇలాంటి కొత్త యాప్ ను వాడడం మంచిదని చాలా మంది యూజర్లు భావిస్తున్నారు. ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను Koo గెల్చుకోవడం విశేషం. దీని ప్రత్యేకతలు ఎంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ట్విట్టర్ లో ఉన్న అన్నీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ యాప్‌ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. Kooలో హిందీ, తెలుగు, కన్నడ, బెంగాళీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, మలయాళం, తమిళం, ఒరియా, అస్సామీ భాషల్లో పోస్టులు రాసే అవకాశం ఉంది. పోస్టులు ఆడియో, వీడియో, ఫొటోలను షేర్ చేసుకోవచ్చు. పోల్స్ కూడా నిర్వహించుకొనే అవకాశం కల్పించారు. DMల ద్వారా ఛాటింగ్ చేసుకోవచ్చు.

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి : –
Koo యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైస్‌లలో దీన్ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌కు గూగుల్ ప్లే స్టోర్లో 4.7 స్టార్ రేటింగ్ ఉంది. iOS యాప్ స్టోర్‌లో 4.1 రేటింగ్ పొందింది. పది లక్షలకు పైగా డౌన్లోడ్‌లతో Koo యాప్ దూసుకుపోతోంది.