Internet Explorer : ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు వీడ్కోలు.. గుర్తుగా సమాధి.. కొరియన్ ఇంజినీర్ నివాళి..!
మైక్రోసాఫ్ట్ దిగ్గజం ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్కు దాదాపు 27 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ప్రపంచానికి కన్నీటి వీడ్కోలు పలికింది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు స్పీడ్ అండ్ సేఫ్ ఇంటర్నెట్ కోసం ప్రయత్నిస్తోంది.

Internet Explorer : మైక్రోసాఫ్ట్ దిగ్గజం ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్కు దాదాపు 27 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ప్రపంచానికి కన్నీటి వీడ్కోలు పలికింది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు స్పీడ్ అండ్ సేఫ్ ఇంటర్నెట్ కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Microsoft Edge) బ్రౌజర్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఇంటర్నెట్ యూజర్లను కోరింది. క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్, ఒపెరాతో సహా పోటీదారులచే ఎక్స్‌ప్లోరర్ పోటీపడలేకపోయింది. 90ల నుంచి 2000ల ప్రారంభంలో ఇంటర్నెట్ యూజర్లకు జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 27ఏళ్ల తర్వాత ఎక్స్‌ప్లోరర్ రిటైర్మెమెంట్ తీసుకుంటుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మెమెరీని గుర్తుచేసుకోవడానికి ఓ కొరియన్ ఇంజినీర్ ఏకంగా సమాధిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు తగిన నివాళిగా భావించాడు. దక్షిణ కొరియాకు చెందిన ఇంజనీర్, జంగ్ కి-యంగ్ సమాధి కోసం సుమారు $300 (సుమారు రూ. 25,000) ఖర్చు పెట్టాడు. శ్మశానవాటికలో సమాధిపై ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ గురించి కొన్ని విషయాలను రాశాడు. ఇతర బ్రౌజర్లను డౌన్లోడ్ చేయడానికి ఇది ఒక గుడ్ టూల్ అని రాసిన ఒక శిలాఫలకాన్ని ఉంచాడు. ఏళ్ల తరబడి ఎక్స్‌ప్లోరర్ ప్రధానంగా క్రోమ్ లేదా ఫైర్ఫాక్స్ వంటి మెరుగైన వేగవంతమైన బ్రౌజర్లను డౌన్లోడ్ చేయడానికి ఉపయోగించేవారు.

Korean Engineer Builds Gravestone Worth Rs 25,000 In Memory Of Internet Explorer
ఎక్స్‌ప్లోరర్ అన్ని విండోస్ డివైజ్‌ల్లో ముందే లోడ్ అయి ఉంటుంది. కాబట్టి యూజర్లు తమ సిస్టమ్‌లో ఇతర బ్రౌజర్లను పొందడంలో సాయపడే ఏకైక టూల్‌గా భావించారు. కొరియన్ ఇంజినీర్ నిర్మించిన ఈ IE సమాధి రాయిని దక్షిణ కొరియాలోని జియోంగ్జులోని దక్షిణ నగరంలో తన సోదరుడు నడిపే కేఫ్‌లో ప్రదర్శించారు. సమాధిని ఫొటో తీసి వెంటనే పోస్టు చేయడంతో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ఎక్స్‌ప్లోరర్ ఒకప్పుడు ఇంటర్నెట్లో ఆధిపత్యం చెలాయించిందని అతడు చెప్పాడు. జూన్ 15న, మైక్రోసాఫ్ట్, బ్లాగ్ పోస్ట్‌లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ రిటైర్మెంట్ను ప్రకటించింది. IE కంటే మెరుగైన ఎడ్జ్ బ్రౌజర్‌కి మారమని తమ యూజర్లను ప్రోత్సహించింది. Microsoft Edge ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కంటే వేగవంతమైనది. అంతేకాదు చాలా సేఫ్ కూడా. ఆధునిక బ్రౌజింగ్ అనుభవమే కాదు.. పాత, లెగసీ వెబ్సైట్లు అప్లికేషన్లకు కూడా బాగా సపోర్టు చేస్తుంది.
Read Also : Internet Explorer : 27ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ రిటైర్మెంట్.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉందిగా..!
- Elon Musk: ఎలన్ మస్క్ పాలసీ నచ్చక మైక్రోసాఫ్ట్, అమెజాన్ వైపు చూస్తున్న టెస్లా ఉద్యోగులు
- Tech Salaries Hike : ఉద్యోగుల జీతాలను భారీగా పెంచేసిన టెక్ కంపెనీలు..!
- Bill Gates : బిల్ గేట్స్ ఫోల్డబుల్ ఫోన్ వాడుతున్నాడా? మైక్రోసాఫ్ట్ ఫోన్ అయితే కాదు..!
- Chandrababu On Hyderabad : హైదరాబాద్ అభివృద్ధికి కారణం నేనే, ఇక్కడా పార్టీని బలోపేతం చేస్తా-చంద్రబాబు
- Teenage Mastermind : మైక్రోసాఫ్ట్, శాంసంగ్ సీక్రెట్స్ హ్యాక్ చేసిన 16ఏళ్ల టీనేజర్.. మాస్టర్ మైండ్ ఇతడే..!
1MS Dhoni : ఎంఎస్ ధోనీకి ఏమైంది. రూ.40లతో నాటు వైద్యం..!
2Salaar: యాక్షన్‌తోనే క్లూ ఇస్తోన్న సలార్.. మీకు అర్థమవుతోందా..?
3Prophet Comment Row : అమరావతి కెమిస్ట్ హత్య కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు-హోం మంత్రి అమిత్ షా
4PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
5Jamun Fruits : మెదడు, గుండెకు ఔషధంగా పనిచేసే నేరేడు పండ్లు!
6Pawan Kalyan: మెగా కాంబో మూవీ షురూ అయ్యేది అప్పుడే..!
7Vasundhara Raje: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చే అంశంపై చర్చించాం: వసుంధరా రాజే
8Nupur Sharma: నుపుర్ శర్మకు సపోర్ట్ చేసి హత్యకు గురైన మరో వ్యక్తి
9BVR School : హైదరాబాద్ ఐఐటీలో బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ పార్క్
10Increase Memory : జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరగాలంటే?
-
Anasuya: మధురవాణిగా మారుతున్న దాక్షాయణి..?
-
Ear Infection : చెవి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారా! వెల్లుల్లితో..
-
Ram Charan: నయా లుక్‌లో చరణ్ రచ్చ..!
-
RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!