KTM 250 Adventure : కొత్త బైక్ అదిరే ఆఫర్.. ధర రూ.25వేలు తగ్గిందోచ్!

బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. ప్రీమియం బైక్ బ్రాండ్ KTM 250 అడ్వెంచర్ బైక్ ధర తగ్గింది. ఈ బైకుపై కంపెనీ ప్రత్యేక ధరను ప్రకటించింది.

KTM 250 Adventure : కొత్త బైక్ అదిరే ఆఫర్.. ధర రూ.25వేలు తగ్గిందోచ్!

Ktm 250 Adventure Price Cut By Rs 25,000 (1)

KTM 250 Adventure price cut : బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వాహనతయారీదారు కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు భారీగా డిస్కౌంట్లు అందిస్తున్నాయి. కరోనా కాలంలో భారీగా నష్టపోయిన పలు వాహనతయారీదారు కంపెనీలు.. కస్టమర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రీమియం బైక్ బ్రాండ్ KTM 250 అడ్వెంచర్ బైక్ ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ బైకుపై కంపెనీ ప్రత్యేక ధరను ప్రకటించింది. 250 అడ్వెంచర్ బైక్ దాదాపు రూ.25వేలు తగ్గింది. దాంతో రూ.2 .3 లక్షలకు ధర తగ్గింది. జూలై 14 నుంచి ఆగస్టు 31 వరకు ఈ స్పెషల్ ప్రమోషనల్ ధర అందుబాటులో ఉంటుంది. అడ్వెంచర్ బైక్ సిగ్మంట్ కోరుకునే కస్టమర్లను మరింత ప్రోత్సహించేందుకు కంపెనీ భారీగా తగ్గించింది.

ఈ KTM 250 Adventure బైక్ లేటెస్ట్ టెక్నాలజీతో పాటు ఆకర్షణీయ ధర, ఆకర్షణీయ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయని బజాబ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ పేర్కొన్నారు. ఈ బైకుపై అందించే ప్రమోషనల్ ఆఫర్ లిమిటెడ్ మాత్రమేనని అన్నారు. ఈ బైక్‌లో 250CC ఇంజిన్ ఉంటుంది. టూవీలర్ అమ్మకాలను పెంచుకోవాలనే లక్ష్యంతో బజాజ్ కంపెనీ తాత్కాలికంగా ధరను తగ్గించింది.