Lamborghini Urus SUV : ఇండియా రోడ్ల మీద 317 కి.మీ స్పీడ్ దూసుకెళ్లిన లాంబోర్గినీ యూరస్.. టాప్ సెలబ్రిటీల సూపర్ లగ్జరీ కారు ఇదే..!

లాంబోర్గినీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి చెప్పన్కర్లేదు. ఇదో సూపర్ లగ్జరీ కారు.. సెలబ్రేటీలు సహా రిచ్ కిడ్స్ ఎక్కువగా ఈ మోడల్ సూపర్ లగ్జరీ కార్లనే వాడుతుంటారు. ఇలాంటి మోడల్స్ భారత మార్కెట్లో ఎన్నో ఉన్నాయి.

10TV Telugu News

Lamborghini Urus SUV : లాంబోర్గినీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి చెప్పన్కర్లేదు. ఇదో సూపర్ లగ్జరీ కారు.. సెలబ్రేటీలు సహా రిచ్ కిడ్స్ ఎక్కువగా ఈ మోడల్ సూపర్ లగ్జరీ కార్లనే వాడుతుంటారు. ఇలాంటి మోడల్స్ భారత మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవల నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ (NATRAX) ఆసియాలో పొడవైన వేగవంతమైన టెస్ట్ ట్రాక్‌ను మధ్యప్రదేశ్ లోని పితాంపూర్‌లో డెవలప్ చేసింది. ఈ ఫెసిలిటీని ఇటీవలే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు. ఈ టెస్ట్ ట్రాక్‌కు స్పీడ్ లిమిట్స్ లేవు. ఈ కార్లలో దాని వాటి లిమిట్ బట్టి వేగం పెరిగేలా డిజైన్ చేశారు. ఈ టెస్టు ట్రాక్ ద్వారా కార్ల టాప్ స్పీడ్ చేరుకునేలా అనుకూలమైన పరిస్థితులను కల్పించవచ్చు. సూపర్ కార్ లగ్జరీ SUV యజమానులు ఇప్పటికే ఈ సదుపాయాన్ని వినియోగించడం ప్రారంభించారు.

ఆసియాలో లాంగెస్ట్ టెస్ట్ ట్రాక్‌ రికార్డు :
Lamborghini Urus SUV కారు వేగం కూడా 317 కిలోమీటర్ల స్పీడ్ తాకింది. ఈ టెస్టింగ్ ట్రాక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఆసియాలో లాంగెస్ట్ టెస్ట్ ట్రాక్‌ రికార్డు ఇదే కావడం విశేషం. ఈ వీడియోను malwasupercarsclub తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియోలో Lamborghini Urus 300Kmph వేగాన్ని అందుకున్నట్టుగా చూడొచ్చు. ఈ కారు టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 190 మైళ్లు లేదా 305kmph స్పీడ్ గా చెప్పవచ్చు. ఈ కారు డ్రైవర్ కారు స్పీడ్ లిమిట్ పెంచేందుకు ట్రై చేస్తుండటం చూడొచ్చు. అప్పటికే SUV కారు 305kmph స్పీడ్ మార్క్ దాటేసింది. SUV కారును 7వ గేర్‌లో నడపడం వల్ల కారు నెమ్మదిగా 317 కిలోమీటర్ల వేగాన్ని తాకడం చూడొచ్చు. సాధారణంగా (instrument cluster) రీడింగ్‌లో వేగానికి వాస్తవ వేగానికి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంటుంది.

SUV నడిచే వాస్తవ వేగం స్పష్టంగా లేదు. Lamborghini Urus SUV కారు అనధికారిక టాప్ స్పీడ్ రికార్డ్ గా చెప్పవచ్చు. గంటకు 250 కి.మీ తటస్థ వేగంతో గరిష్టంగా గంటకు 375 కి.మీ స్పీడ్ తాకేలా NATRAX ఫెసిలిటీని డిజైన్ చేశారు. ఇందులో ఎలాంటి స్పీడ్ లిమిట్స్ లేవు. ఈ ట్రాక్ జీరో శాతం రేఖాంశ వాలును కలిగి ఉంటుంది. ఇక్కడ వాహనాలపై టెస్టింగ్ కచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. Volkswagen, Fiat Chrysler Automobile ఆటోమొబైల్ వంటి అనేక కార్ల
తయారీదారులు కూడా ఇక్కడే టెస్టింగ్ చేస్తుంటాయి. ఈ కొత్త ఫెసిలిటీని వినియోగించుకునేందుకు Peugeot, Lamborghini కార్ల కంపెనీలు కూడా ఆసక్తి చూపించాయి.

Lamborghini Urus SUV విషయానికి వస్తే.. సూపర్ కార్ల యజమానులలో పాపులర్ ఎస్‌యూవీ. స్టైలింగ్ డిజైన్.. ఎట్రాక్టివ్ గా ఉంటుంది. అన్ని రోడ్లకు అనుకూలంగా ఉంటుంది. Lamborghini Urus SUV సేల్స్ కూడా అదే దూకుడుగా ఉంది. లంబోర్ఘిని 100 యూనిట్లకు పైగా సేల్ అయింది. భారత బ్రాండ్లలో అత్యంత సక్సెస్ మోడల్. ఈ సూపర్ లగ్జరీ SUVని ఎక్కువగా సెలబ్రెటీలు వినియోగిస్తున్నారు.

ఫీచర్ల విషయానికి వస్తే..
Lamborghini Urus SUV 4.0 లీటర్ V8, ట్విన్-టర్బో ఇంజిన్‌తో పనిచేస్తుంది. 650Ps 850 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నాలుగు చక్రాలకు పవర్ జనరేట్ చేస్తుంది. ముందు చక్రాలకు 40 శాతం పవర్ అందిస్తుంది. అలాగే వెనుక చక్రాలకు 60 శాతం పవర్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అందిస్తుంది. SUV బరువు 2.2 టన్నులు ఉంటుంది. SUV 3.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల స్ప్రింట్ చేయగలదు. ఇందులోని ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు ఇతర కారులోనైనా (440 మిమీ) కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. లాంబోర్గినీ ధర (ఎక్స్ షోరూమ్)తో కలిపి రూ .3.15 కోట్లు వరకు ఉంటుంది.

 

10TV Telugu News