మార్చి 21న అతిపెద్ద గ్రహశకలం భూమిపైకి దూసుకొస్తోంది..

2021లో మరో అతిపెద్ద గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోందంట.. మార్చి 21న భూమి గుండా ఈ అతిపెద్ద ఉల్క వెళ్లనుందని నాసా వెల్లడించింది. వాస్తవానికి ఈ అతిభారీ ఉల్క భూమికి 2 మిలియన్ కిలోమీటర్ల దూరంలో వెళ్తుందని నాసా పేర్కొంది.

మార్చి 21న అతిపెద్ద గ్రహశకలం భూమిపైకి దూసుకొస్తోంది..

Large Asteroid To Pass By Earth On March 21 Nasa (1)

Large asteroid to pass by Earth on March 21 : 2021లో మరో అతిపెద్ద గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోందంట.. మార్చి 21న భూమి గుండా ఈ అతిపెద్ద ఉల్క వెళ్లనుందని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి ఈ అతిభారీ ఉల్క భూమికి 1.25 మిలియన్ మైళ్లు (2 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో వెళ్తుందని నాసా పేర్కొంది.

ఈ ఉల్కను అతిదగ్గరగా పరీక్షించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలకు వీలుగా ఉంటుందని యుఎస్ అంతరిక్ష సంస్థ తెలిపింది. 2001 FO32 అనే పేరుగల గ్రహశకలం.. సుమారు 3,000 అడుగుల వ్యాసం ఉంటుందని నాసా అంచనా వేస్తోంది. 20 ఏళ్ల క్రితమే ఈ ఉల్కను కనుగొన్నట్టు నాసా తెలిపింది.

Earth Austroid

సూర్యుని చుట్టూ 2001 FO32 ఉల్క కక్ష్య మార్గం ఖచ్చితంగా తమకు తెలుసునని సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ డైరెక్టర్ పాల్ చోడాస్ పేర్కొన్నారు. ఈ గ్రహశకలం గమన వేగం.. 1.25 మిలియన్ మైళ్ల కంటే భూమికి దగ్గరగా ఉండే అవకాశం లేదన్నారు.

చంద్రుడి నుంచి భూమికి సుమారు 5.25 రెట్లు దూరంగా ఉంటుందని చోడాస్ అంచనా వేశారు. 2001 FO32ను అత్యంత ప్రమాదకర గ్రహశకలంగా మారే అవకాశం లేకపోలేదు. చాలావరకు గ్రహశకలాలు భూమివైపు దూసుకొచ్చే వేగం కంటే 2001 FO32 గంటకు 77,000 మైళ్ల వేగంతో వెళుతుందని నాసా తెలిపింది.

Austroid

భూమికి సమీపంలో ఉన్న ఉల్కల్లో 2001 FO32 గ్రహశకలం.. అంతకంటే పెద్ద పరిమాణంలో ఉన్న 95 శాతానికి పైగా గ్రహశకలాల్లో ఏ ఒక్కటి కూడా వచ్చే శతాబ్దంలో భూగ్రహం మీద ప్రభావం చూపే అవకాశం లేదని నాసా వెల్లడించింది.