LastPass Password : లాస్ట్‌పాస్ పాస్‌వర్డ్ మేనేజర్ మళ్లీ హ్యాక్.. మీ డేటా భద్రమేనా? తస్మాత్ జాగ్రత్త..!

LastPass Password : ఆన్‌లైన్‌లో అకౌంట్లను సెక్యూరుగా ఉంచుకోవాలంటే.. పాస్‌వర్డులను స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పాస్‌వర్డులతో కూడిన లాస్ట్‌పాస్ పాస్‌వర్డ్ (LastPass Password) డేటా ఇప్పటికే గతంలో లీకైంది.

LastPass Password : లాస్ట్‌పాస్ పాస్‌వర్డ్ మేనేజర్ మళ్లీ హ్యాక్.. మీ డేటా భద్రమేనా? తస్మాత్ జాగ్రత్త..!

LastPass password manager gets hacked once again, here’s what you should know

LastPass Password : మీరు పాస్‌వర్డ్ మేనేజింగ్ యాప్‌ (Password Managing App)లను వాడుతున్నారా? అయితే మీకు లాస్ట్‌పాస్ (LastPass) యాప్ గురించి తెలిసే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న పాస్‌వర్డ్ మేనేజింగ్ యాప్ (World’s most popular password manager). అయితే, ఈ పాస్‌వర్డ్‌లకు సేఫ్టీ సెంటర్‌గా భావించే అప్లికేషన్ హ్యాక్ (App Hack) అయింది. రెండు వారాల క్రితమే ఈ అప్లికేషన్‌లో ఏదో మార్పులు కనిపించినట్టు గుర్తించారు. ఈ మేరకు కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. ఆన్‌లైన్‌లో అకౌంట్లను సెక్యూరుగా ఉంచుకోవాలంటే.. పాస్‌వర్డులను స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పాస్‌వర్డులతో కూడిన లాస్ట్‌పాస్ పాస్‌వర్డ్ (LastPass Password) డేటా ఇప్పటికే గతంలో లీకైంది. అయితే  అదే లాస్ట్‌పాస్ మేనేజర్ రెండోసారి భద్రతా ఉల్లంఘనకు గురైంది. గత ఆగస్టులో లాస్ట్‌పాస్ మొదటి ఉల్లంఘన తర్వాత హ్యాకర్లు అదే కంపెనీ ఇంటర్నల్ సిస్టమ్, కస్టమర్ యూజర్ డేటాను హ్యాక్ చేశారు.

ఈ సందర్భంగా లాస్ట్‌పాస్ CEO టౌబ్బా మాట్లాడుతూ.. ఆగస్ట్ ఉల్లంఘన సమయంలో పొందిన డేటాను ఉపయోగించి హ్యాకర్లు తమ కస్టమర్ల డేటాలోని కొన్ని అంశాలకు యాక్సస్ పొందడం జరిగిందన్నారు. దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించామని CEO అధికారిక ప్రకటనలో తెలిపారు. తమ కస్టమర్ల పాస్‌వర్డ్‌లు సురక్షితంగా ఉన్నాయని ఆయన హామీ ఇచ్చారు. లాస్ట్‌పాస్ జీరో నాలెడ్జ్ ఆర్కిటెక్చర్ కారణంగా తమ కస్టమర్‌ల పాస్‌వర్డ్‌లు సురక్షితంగా ఎన్‌క్రిప్ట్ అయి ఉన్నాయని ఆయన తెలిపారు.

LastPass password manager gets hacked once again, here’s what you should know

LastPass password manager gets hacked once again

Read Also : Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

LastPass ప్రొడక్టులు, సర్వీసులు పూర్తిగా సెక్యూర్‌గా పనిచేస్తాయని నిర్థారించినట్టు టౌబ్బా చెప్పారు. LastPass, అనుబంధ GoTo రెండింటి భాగస్వామ్యంతో థర్డ్ పార్టీ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసులో కంపెనీ అసాధారణ యాక్సస్ చేసినట్టు గుర్తించిందని LastPass CEO వివరించారు. తమ కస్టమర్ల వాల్ట్‌ల మాస్టర్ పాస్‌వర్డ్‌లకు ఎలాంటి యాక్సెస్ లేదని కంపెనీ తెలిపింది.

జీరో నాలెడ్జ్ సెక్యూరిటీ మోడల్‌లో భాగంగా వాల్ట్ డేటాను డీక్రిప్ట్ చేయడంతో పాటు మాస్టర్ పాస్‌వర్డ్ లేకుండా వాల్ట్ యజమానికి తప్ప మరెవరికీ సాధ్యం కాదని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇంతకీ వినియోగదారులు ఏమి చేయాలి? గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా స్ట్రాంగ్ స్పెషల్ పాస్‌వర్డ్‌ను మాస్టర్ పాస్‌వర్డ్‌గా సెటప్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా మాస్టర్ పాస్‌వర్డ్‌ను యాక్సస్ చేస్తే.. మీ అన్ని ఆధారాలు, వ్యక్తిగత వివరాలు లీక్ అవుతాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : LastPass Hacked : వరల్డ్ ఫేమస్ పాస్‌వర్డ్ మేనేజర్ ‘లాస్ట్‌పాస్’ హ్యాక్ అయిందట.. మీరు ఈ యాప్ వాడుతున్నారా? ఓసారి చెక్ చేసుకోండి!