Lava Probuds Earphones : రిపబ్లిక్ డే ఆఫర్ సేల్.. కేవలం రూ. 26లకే లావా ప్రోబడ్స్ ఇయర్‌ఫోన్లు.. వెంటనే కొనేసుకోండి..!

Lava Probuds Earphones : లావా ప్రోబడ్స్ 21 రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌లు గత ఏడాదిలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు ఇప్పుడు భారీ తగ్గింపు ధరకు అందుబాటులోకి రానున్నాయి.

Lava Probuds Earphones : రిపబ్లిక్ డే ఆఫర్ సేల్.. కేవలం రూ. 26లకే లావా ప్రోబడ్స్ ఇయర్‌ఫోన్లు.. వెంటనే కొనేసుకోండి..!

Lava Probuds 21 TWS Earphones to Go on Sale for Rs. 26 as Part of Republic Day Offer

Lava Probuds Earphones : లావా ప్రోబడ్స్ 21 రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌లు గత ఏడాదిలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు ఇప్పుడు భారీ తగ్గింపు ధరకు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 26 (గురువారం) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కేవలం రూ. 26లకే Lava Probuds 21 TWS ఇయర్‌ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు. 12mm డైనమిక్ డ్రైవర్‌లతో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్ హై-డెఫినిషన్ సౌండ్‌ను అందిస్తాయి. ఇయర్‌బడ్‌లు గరిష్టంగా 9 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ఐదు పూర్తి ఛార్జీలను అందించగల ఛార్జింగ్ కేస్‌తో వస్తాయి.

లావా Probuds 21 రిపబ్లిక్ డే ఆఫర్ ఇదిగో :
Lava Probuds 21 జనవరి 26న అమెజాన్ (Amazon), లావా E-స్టోర్ ద్వారా కేవలం రూ. 26లకే సొంతం చేసుకోవచ్చు. ఈ Lava TWS ఇయర్‌ఫోన్‌ల లిమిటెడ్ స్టాక్‌లు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ. 1,499గా ఉండగా.. ఇప్పుడు గ్లేసియర్ బ్లూ, ఓషన్ బ్లూ, సన్‌సెట్ రెడ్ కలర్స్‌లో కూడా వస్తున్నాయి.

Lava Probuds 21 TWS Earphones to Go on Sale for Rs. 26 as Part of Republic Day Offer

Lava Probuds 21 TWS Earphones to Go on Sale for Rs. 26 as Part of Republic Day Offer

Read Also : Coca-Cola Phone : డ్యుయల్ రియర్ కెమెరాలతో కోకా-కోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

లావా ప్రోబడ్స్ 21 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే :
Lava Probuds 21 TWS ఇయర్‌ఫోన్‌లు 12mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. బ్లూటూత్ 5.1 వైర్‌లెస్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. సున్నితమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 75ms అల్ట్రా-లో-లేటెన్సీ కనెక్షన్‌లను అందిస్తాయి. అంతేకాదు.. ఫిజికల్ సౌండ్ ఐసోలేషన్, నాయిస్ క్యాన్సిలేషన్ తగ్గిస్తాయి. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు గరిష్టంగా 9 గంటల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటాయి. అదనంగా, ఛార్జింగ్ కేస్‌తో మొత్తం 45 గంటల వరకు బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటాయి.

200 నిమిషాల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందించడానికి 20 నిమిషాల ఛార్జ్ సరిపోతుందని లావా పేర్కొంది. Google Assistant, Siri వాయిస్ అసిస్టెంట్‌లకు సపోర్టు అందిస్తాయి. Lava Probuds 21 ఇయర్‌బడ్‌లు 20Hz నుంచి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కలిగి ఉంటాయి. IPX4 రేట్‌తో పాటు ఇయర్‌ఫోన్‌లు మ్యూజిక్ ప్లేబ్యాక్, కాల్‌లను కనెక్ట్ చేసేందుకు టచ్ కంట్రోల్ కూడా కలిగి ఉంటాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel Plans Price Hike : ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్.. 57శాతం పెరిగిన చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు.. ఇప్పుడు ఒక్కో ప్లాన్ ధర ఎంతో తెలుసా?