2021 జనవరి నుంచే వీటి ధరలు పెరుగుతాయి ?

2021 జనవరి నుంచే వీటి ధరలు పెరుగుతాయి ?

LED TVs, refrigerators, washing machines set to get expensive : కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సంవత్సరమైనా బాగుండాలని కోరుకుంటున్నారు. ధరలు పెరగకుండా..ఉండాలని అనుకుంటున్న వారికి షాకింగ్ న్యూసే. సామాన్యుడి నుంచి బడా బాబుల వరకు ఉపయోగించే ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్‌ల వంటి సామాగ్రి ధరలు పెరిగే ఛాన్స్ ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. దాదాపు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇందులో ఉపయోగించే ముడి పదార్థాలు కాపర్, అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్ ధరల ప్రభావం వీటిపై స్పష్టంగా పడింది.

ముడి సరుకుల ధరలు పెరుగుతాయని భావిస్తున్నామని, ఇవి ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతాయని కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఎల్.జి, పానసానిక్, థాంప్సన్ కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అంచనా వేస్తున్న ప్రకారం జనవరిలో దాదాపు 7 శాతం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పానసానిక్ ఇండియా సీఈవో వెల్లడించారు. జనవరి నెల నుంచి అన్ని ఉత్పత్తులపై ధరలను 8 శాతం వరకు పెంచుతున్నట్లు, కాపర్, అల్యూమినియం వంటి వాటి ధరల్లో పెరుగుదల ఉందని ఎల్.జి ఎలక్ర్టానిక్స్ ఇండియా హోం అప్లియన్స్ వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు.

సోని ఇండియా మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారతీయ విభాగం ఎండీ సునీల్ నయ్యర్ వెల్లడించారు. ప్యానళ్ల సరఫరా గణనీయంగా తగ్గిపోవడం, వీటి ధరలు కూడా పెరగడం ప్రధాన కారణమంటున్నారు బిజినెస్ నిపుణులు.