LeEco S1 Pro 5G : ఈ కొత్త ఫోన్ అచ్చం ఐఫోన్‌లానే ఉంది.. ఆపిల్ ఐఫోన్ అసలే కాదు.. ఐఫోన్ల కన్నా ధర చాలా తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

LeEco S1 Pro Launch : చైనీస్ టెక్ బ్రాండ్ LeEco కంపెనీ iPhone 14 Pro మాదిరిగా కనిపించే LeEco S1 Pro స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది.

LeEco S1 Pro 5G : ఈ కొత్త ఫోన్ అచ్చం ఐఫోన్‌లానే ఉంది.. ఆపిల్ ఐఫోన్ అసలే కాదు.. ఐఫోన్ల కన్నా ధర చాలా తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

LeEco S1 Pro _ This phone looks like iPhone, smells like iPhone, walks like iPhone but is not an Apple iPhone

LeEco S1 Pro 5G : ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. చాలావరకూ స్మార్ట్‌ఫోన్ మేకర్లు ఆపిల్ ఐఫోన్ మాదిరిగా తమ ప్రొడక్టులను రూపొందించేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో ముందు ఉండేది చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్లు.. ఇతర ఫోన్ల ఫీచర్లను అచ్చుగుద్దినట్టుగా దించేయడంలో చైనా దిట్ట అని చెప్పవచ్చు. చైనా ఫోన్లను చూస్తే.. పైకి మాత్రం అసలైన ఐఫోన్ల మాదిరిగా ఫీచర్లు ఉంటాయి. కానీ, లోపల మాత్రం అన్నీ చైనా బ్రాండ్లే ఎక్కువగా ఉంటాయి.

చైనాలో ఆపిల్ ఐఫోన్ క్లోన్.. ఆండ్రాయిడ్ 5G ఫోన్ ఇదే :
సాధారణంగా ఆపిల్ కొత్త ప్రొడక్టుల్లో AirPods, Mac PCలు లేదా టాబ్లెట్‌లు కావచ్చు. ఏదైనా మార్కెట్లోకి రాగానే.. అనేక Android OEMలు తమ సొంత డిజైన్‌లను అందించేందుకు పెద్దగా సమయాన్ని వృథా చేయవు. అందుకే తమ ప్రొడక్టులను చాలా చౌకగా అందిస్తాయి. గత ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ ఐఫోన్ 14 మోడల్, ఐఫోన్ 13 సిరీస్‌తో సమానంగా కనిపిస్తుంది. ఈ ప్రో మోడల్స్ iPhone 14 Pro, 14 Pro Max కంపెనీ డైనమిక్ ఐలాండ్, ఫ్లాట్ ఎడ్జ్‌లు అనే ప్రత్యేకమైన నాచ్‌తో వచ్చాయి. ఐఫోన్ వినియోగదారులకు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి.

Read Also : iPhone 14 Huge Discounts : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇమాజిన్ స్టోర్‌లోనూ ఐఫోన్లపై అదిరే డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

LeEco  ఫోన్ రూ. 10,900 లకే ఫ్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు :
ఇప్పుడు అలాంటి ఫోన్ ఒకటి చైనా ప్రపంచ మార్కెట్లోకి వదిలింది.. అది చూడటానికి అచ్చం ఆపిల్ ఐఫోన్ మాదిరిగానే కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్ అయినా.. ఆపిల్ ఐఫోన్ తలదన్నేలా ఫీచర్లను డిజైన్ చేసింది. చైనీస్ టెక్ బ్రాండ్ LeEco కంపెనీ iPhone 14 Pro మాదిరిగా కనిపించే LeEco S1 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది.

LeEco S1 Pro _ This phone looks like iPhone, smells like iPhone, walks like iPhone but is not an Apple iPhone

LeEco S1 Pro _ This phone looks like iPhone

GSMArena ప్రకారం.. LeEco S1 Pro 5G చైనాలో 8GB RAM, 128GB మోడల్ ధర CNY 899 (సుమారు రూ. 10,900) వద్ద ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. రూ. 1,29,900 వద్ద రిటైల్ చేసే ఐఫోన్ 14 ప్రో బేస్ మోడల్ కన్నా చాలా తక్కువ ధరకే అందిస్తోంది. అంటే.. రూ. 1.19 లక్షలు తేడాతో అందిస్తోంది.

LeEco S1 ప్రో ధర కూడా చాలా తక్కువే :
ఈ ఫోన్ హార్డ్‌వేర్‌లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. LeEco S1 ప్రో మోడల్ చాలా చౌకగా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ 14 ప్రో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లేలు విభిన్న రిజల్యూషన్‌లు, రిఫ్రెష్ రేట్‌లను కూడా అందిస్తాయి. LeEco S1 Pro HD+ (720x1600px) రిజల్యూషన్‌ను కలిగి ఉంది. అయితే iPhone హై-ఎండ్ 4K రిజల్యూషన్‌లో కంటెంట్‌ను డిస్‌ప్లే చేయగలదు. LeEco S1 Proలో రిఫ్రెష్ రేట్ గరిష్టంగా 60Hz వద్ద ఉంది. అయితే 14 Pro 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందించే అరుదైన స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు.

LeEco S1 Pro _ This phone looks like iPhone, smells like iPhone, walks like iPhone but is not an Apple iPhone

LeEco S1 Pro _ This phone looks like iPhone, smells like iPhone, walks like iPhone

ఐఫోన్ 14 Pro ఫీచర్లతో :
ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్ ప్రో మాక్స్‌ (iPhone 14 Pro Max) లోని డైనమిక్ ఐలాండ్ మాదిరిగా లేకపోయినా LeEco S1 ప్రోలోని నాచ్ ఫంక్షనల్‌గా ఉందని నివేదిక పేర్కొంది. చైనీస్ కౌంటర్ 12nm Zhanrui T7510 చిప్‌సెట్ నుంచి పవర్ అందిస్తుంది. ఆసక్తికరంగా, LeEco S1 ప్రో మోడల్ వెనుక 3 కెమెరాలను కలిగి ఉంది. ప్లేస్‌మెంట్ iPhone 14 Proలోని సెన్సార్‌ల మాదిరిగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ 13-MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ నాచ్ 5-MP స్నాపర్‌ని కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ ఫోన్ కేవలం 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఐఫోన్ 14 ప్రో 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

LeEco S1 Pro _ This phone looks like iPhone, smells like iPhone, walks like iPhone but is not an Apple iPhone

LeEco S1 Pro _ This phone looks like iPhone, smells like iPhone, walks like iPhone

LeEco S1 ప్రో ఫోన్ ప్రత్యేకంగా చైనీస్ మార్కెట్ కోసమే రూపొందించారు. ఈ ఫోన్ Google మొబైల్ సర్వీసులకు బదులుగా Huawei మొబైల్ సర్వీసులకు సపోర్టు ఇస్తుంది. చైనాలో GMS (Google మొబైల్ సర్వీసులు) అందుబాటులో లేనందున పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. LeEco S1 ప్రో మోడల్.. ఐఫోన్ 14 ప్రో మాదిరిగానే కనిపిస్తున్నప్పటికీ.. చాలావరకూ ఆండ్రాయిడ్ ఫోన్ మేకర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఆపిల్ మాదిరిగానే అందించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఈ LeEco S1 Pro ఫోన్ కూడా అలానే మార్కెట్లోకి వచ్చింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 13 Big Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై బిగ్ డిస్కౌంట్.. తొందరపడి ఇప్పుడే కొనొద్దు.. ఎందుకో తెలుసా?