LG Electronics: ప్రపంచంలోనే తొలి 83 అంగుళాల OLED TV

దక్షిణ కొరియా దిగ్గజం LG Electronics ప్రపంచంలోనే తొలి 83అంగుళాల OLED TVని లాంచ్ చేయనున్నట్లు ఆదివారం వెల్లడించింది. 83C1 పేరుతో లాంచ్ కానున్న ఈ మోడల్ 4కే రిసొల్యూషన్ తో మార్కెట్లోకి రానుంది.

LG Electronics: ప్రపంచంలోనే తొలి 83 అంగుళాల OLED TV

Oled Tv (1)

LG Electronics: దక్షిణ కొరియా దిగ్గజం LG Electronics ప్రపంచంలోనే తొలి 83అంగుళాల OLED TVని లాంచ్ చేయనున్నట్లు ఆదివారం వెల్లడించింది. 83C1 పేరుతో లాంచ్ కానున్న ఈ మోడల్ 4కే రిసొల్యూషన్ తో మార్కెట్లోకి రానుంది. ఇది ముందుగా దక్షిణ కొరియాలో అందుబాటులో ఉండగా జూన్ నెలలో యునైటెడ్ స్టేట్స్ లోకి రానుంది.

దక్షిణకొరియాలో దీని ధరను 9వేల 630డాలర్లుగా నిర్ణయించారు. లేటెస్ట్ గా ఎల్‌జీ ఓఎల్ఈడీ టీవీ.. 48-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు, 77-అంగుళాలు, 88-అంగుళాల మోడల్స్ ఆల్రెడీ లైనప్ లో ఉన్నాయి. ఇప్పుడు రానున్న 88అంగుళాల 8కే రిసొల్యూషన్ టీవీకి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు బెటర్ ఎక్స్ పీరియెన్స్, గేమ్స్ ఆడుకోవడానికి డిస్ ప్లే కంఫర్ట్ గా ఉంటుంది.

గతేడాది 3.65 మిలియన్ యూనిట్లు అమ్ముడవడంతో.. ఈ ఏడాది 5.8 మిలియన్ అమ్మకాలు జరపాలని సంస్థ ప్లాన్ చేస్తుంది. ఈ గ్లోబల్ టీవీ మార్కెట్లో 10శాతం రెవెన్యూ దక్కించుకోవాలని OLED టీవీ ప్లాన్ చేస్తుంది.