LG Gram 2021 Laptops: అద్భుతమైన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌లు.. భారత మార్కెట్లోకి! ధర ఎంతంటే?

LG గ్రామ్ 2021 ల్యాప్‌టాప్‌లు బుధవారం(4 ఆగస్ట్ 2021) భారతదేశంలో విడుదలయ్యాయి.

LG Gram 2021 Laptops: అద్భుతమైన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌లు.. భారత మార్కెట్లోకి! ధర ఎంతంటే?

2021

LG Gram 2021 Laptops: LG గ్రామ్ 2021 ల్యాప్‌టాప్‌లు బుధవారం(4 ఆగస్ట్ 2021) భారతదేశంలో విడుదలయ్యాయి. ఇది LG గ్రామ్ 17 (17Z90P), LG గ్రామ్ 16(16Z90P) మరియు LG గ్రామ్ 14 (14Z90P) అనే మూడు మోడళ్లను మార్కెట్లోకి తీసుకుని వచ్చింది సంస్థ. కొత్త LG గ్రామ్ ల్యాప్‌టాప్‌లు 11వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో సాంప్రదాయ 16:9 డిస్‌ప్లేలతో పెద్ద స్క్రీన్ అందిస్తూ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ముఖ్యమైన పనులను మరింత సామర్థ్యంతో, స్మార్ట్‌గా పూర్తి చేసేందుకు ఎక్కువ సాంకేతికత అవసరమవుతోంది. అందుకే ఈనాటి ప్రపంచంలో ఆధారపడదగిన అత్యున్నత పనితీరు కలిగిన ల్యాప్‌టాప్‌ అవసరం ఏర్పడింది. ఉద్యోగులకు, విద్యార్థిలోకానికి నిత్యం కనెక్ట్‌ అయ్యేవారైనా ల్యాప్‌టాప్‌ అవసరం చాలా ఉంటుంది. అందుకే ఇప్పుడు 11th జెనరేషన్ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు (11th Gen Intel® Core™ processors) ఉన్న ల్యాప్‌టాప్ అవసరం ఎంతో ఉంటుంది.

భారతదేశంలో LG గ్రామ్ 2021 ధర:
LG గ్రామ్ 2021 లైనప్ భారతదేశంలో ప్రారంభ ధర రూ. 74,999గా ఉండగా.. ల్యాప్‌టాప్‌లను దేశంలోని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా విక్రయిస్తోంది సంస్థ. అమెజాన్ ఇప్పటికే సేల్ ప్రారంభించింది. ప్రీ-బుకింగ్ ఆఫర్‌తో పాటు కస్టమర్‌లు ల్యాప్‌టాప్‌లను ముందుగానే బుక్ చేసుకుంటే 500 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.

AIతో గేమింగ్ అనుభూతి..
11th జెనరేషన్ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు ఉన్న లాప్‌టాప్‌లో AI(artificial intelligence) ఆధారిత సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి. వేగంగా, సులభంగా, ఎక్కువ పని చేసుకొనేందుకు.. మసకగా కనిపించే చిత్రాలను క్రిస్ప్‌గా మార్చుకునేందుకు గేమింగ్‌లో అసలైన అనుభూతి పొందేందుకు, ఫోటో షాప్, వీడియో చిత్రాలపై అవసరంలేని వాటిని తొలగించుకోవచ్చు. కాన్ఫరెన్స్‌ కాల్స్‌లో ఇబ్బంది పెట్టే శబ్దాలను సెకన్ల వ్యవధిలో తగ్గించే అవకాశం ఉంది. ఇక ప్రతిరోజూ ఉపయోగించే మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, గూగుల్‌ క్రోమ్‌, జూమ్‌ వంటి అప్లికేషన్లు ఇందులో చాలా బాగా పనిచేస్తాయి. రెస్పాన్సివ్‌నెస్‌ వేగంగా ఉంటుంది.

11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లతో ల్యాప్‌టాప్‌లు:
సన్నని, తేలికపాటి ల్యాప్‌టాప్‌ల్లో Next Generation గ్రాఫిక్స్‌ అందుబాటులో ఉంది. 11th Gen ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్ల వల్ల చూడచక్కని గ్రాఫిక్స్‌ ఆశ్వాదించవచ్చు. Intel® Iris®, Xe graphicsతో కూడి శక్తిమంతంగా ఉంటాయి. AI(artificial intelligence) సహకారం వల్ల సృజనాత్మక పనులను సులభంగా చేసుకోవచ్చు. ఆటలను, స్ట్రీమింగ్‌ టైటిళ్లను 1080p, 60FPS లేదా ఒకేసారి నాలుగు 4కే హెచ్‌డీ రెజల్యూషన్‌ డిస్‌ప్లేలతో నడుపుకోవచ్చు.