LG OLED TV: చుట్టగా చుట్టేసే టీవీని విడుదల చేసిన ఎల్‌జీ సంస్థ: ధర ఎంతో తెలుసా?
మనకు స్క్రీన్ అవసరం లేనప్పుడు లేదా టెలివిజన్ దగ్గర లేనప్పుడు కిందనే ఉండే సౌండ్ సిస్టమ్‌లోకి చుట్టేయవచ్చు.

LG OLED TV: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం, స్క్రీన్ తయారీలో రారాజు..ఎల్‌జీ..భారత్ లో సరికొత్త టీవీలను విడుదల చేసింది. OLED సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌జీ అభివృద్ధి చేసిన ఈ టీవీలు ఎంతో నాణ్యత కలిగి ఉండి..ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకుంటాయని సంస్థ తెలిపింది. ఎల్‌జీ ఇండియా మంగళవారం ప్రీమియం టీవీలను భారత విఫణిలో విడుదల చేసింది. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది LG Signature R OLED టీవీ గురించే. సిగ్నేచర్ R OLED TV, ఇది రోల్(చుట్టగా చుట్టేయడం) చేయదగిన OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. మనకు స్క్రీన్ అవసరం లేనప్పుడు లేదా టెలివిజన్ దగ్గర లేనప్పుడు కిందనే ఉండే సౌండ్ సిస్టమ్‌లోకి చుట్టేయవచ్చు. సాంకేతికంగా ఎంతో జాగ్రత్తగా అభివృద్ధి చేసిన ఈ టీవీని చూసి వినియోగదారులు థ్రిల్ అవుతారని సంస్థ ప్రతినిధి తెలిపారు.
Other Stories:Realme C30 : రియల్‌మి నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ఏం ఉండొచ్చంటే?
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి అద్భుతమైన సాంకేతికతను తమ ప్రీమియం కస్టమర్ల కోసం తీసుకొచ్చినట్లు ఎల్‌జీ సంస్థ తెలిపింది. 97 అంగుళాల ఈ చుట్ట టీవీ ధర రూ. 75 లక్షలుగా నిర్ణయించింది ఎల్‌జీ సంస్థ. దీనితో పాటుగా..ఇదే తరహా OLED సాంకేతికత వినియోగించి మరికొన్ని ప్రీమియం టీవీలను కూడా భారత వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఎక్కువ ధర వెచ్చించి ‘చుట్ట’ టీవీ కొనుగోలు చేయలేని వినియోగదారులు..తక్కువ ధరలో అదే అనుభూతి పొందేలా G2, Z2, C2 సిరీస్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్‌జీ పేర్కొంది. 42-అంగుళాల నుండి 97-అంగుళాల వరకు పరిమాణాలలో ఈ OLED TVలు అందుబాటులో ఉండనున్నాయి. సాంకేతిక పరంగా ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చేసిన ఈ టీవీలలో ఎన్నో అడ్వాన్సడ్ ఫీచర్స్ ఉన్నాయని సంస్థ తెలిపింది.
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ